AP Degree Admissions: ఏపీ డిగ్రీ ఆన్‌లైన్ అడ్మిషన్లకు నేటి నుంచి రిజిస్ట్రేషన్లు, జూలై 20 నుంచి తరగతులు
AP Degree Admissions: ఏపీలో డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. జూలై 2నుంచి విద్యార్ధులు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
AP Degree Admissions: ఏపీలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశల కోసం ఆన్‌లైన్ అడ్మిషన్ల నోటిఫికేషన్2024-25ను ఏపీ ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం గత కొన్నేళ్లుగా ఆన్‌లైన్ అడ్మిషన్లను నిర్వహిస్తున్నారు.
2024-25 విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కళాశాలలు, ప్రభుత్వ అటానమస్ డిగ్రీ కళాశాలలు, ప్రైవేట్ ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలు, ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలు, ప్రైవేట్ అటానమస్ డిగ్రీ కళాశాలలు (ఎయిడెడ్ మరియు అన్‌ఎయిడెడ్) కాలేజీల్లో ప్రవేశాలకు రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపుతో కూడిన ఆన్‌లైన్ అడ్మిషన్ ప్రక్రియ జూలై 2 నుండి ప్రారంభమవుతుంది.
కాలేజీల్లో మెరిట్‌ను ప్రోత్సహించడానికి, మెరుగైన ప్రమాణాలను సాధించడానికి అక్రమాలను అరికట్టడానికి, రిజర్వేషన్‌లను అమలు చేయడానికి అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి కొన్నేళ్లుగా ఆన్‌లైన్ అడ్మిషన్ ప్రక్రియను ప్రవేశపెట్టారు, విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మెరిట్ ఆధారిత అడ్మిషన్లను చేపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ డిగ్రీ కాలేజీల్లో ఆన్‌లైన్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. జూలై 1నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. జూలై 2 నుంచి 10వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. జూలై 4వ తేదీ నుంచి ఆరో తేదీ వరకు స్పెషల్ క్యాటగిరీ విద్యార్ధులకు వెరిఫికేషన్ నిర్వహిస్తారు. జూలై 5వ తేదీ నుంచి హెల్ప్‌లైన్ సెంటర్లలో సర్టిఫికెట్ వెరిఫకేషన్ నిర్వహిస్తారు.
జూలై 11 నుంచి 15వ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవచ్చు. జూలై 19వ తేదీన సీట్లను అలాట్ చేస్తారు. జూలై 20వ తేదీ నుంచి 22వ తేదీ వరకు కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అవే తేదీల్లో తరగతుల ప్రారంభిస్తారు.
డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తు చేసుకునే విద్యార్ధులు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్, లేదా ఇతర గుర్తింపు పొందిన బోర్డుల నుండి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆర్ట్స్, సైన్స్, సోషల్ సైన్సెస్, కామర్స్, మేనేజ్‌మెంట్, కంప్యూటర్ అప్లికేషన్స్ మరియు సోషల్ వర్క్ మొదలైన వాటిలో అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో అందుబాటులో ఉన్న సీట్ల కోసం వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనడానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
డిగ్రీ కోర్సులలో B.A., B.Sc., B.Com., BBA., B.Voc, B.F.A, ఇంటర్మీడియట్ అర్హతతో ప్రవేశాలను కల్పిస్తారు. (ఇంజనీరింగ్ మరియు ఫార్మసీ స్ట్రీమ్‌లు మినహా) 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ PG ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు.
ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు:
OC విద్యార్ధులకి రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు రూ.400/-, BCలకి 300/- ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులు రూ. 200/- చెల్లించాల్సి ఉంటుంది. ఫీజుల్ని క్రెడిట్ కార్డ్/ డెబిట్ కార్డ్/ (లేదా) వెబ్‌సైట్లో https://cets.apsche.ap.gov.in/APSCHE/OAMDC24/OAMDCHome.html ని “పే ప్రాసెసింగ్ ఫీజు” లింక్ ద్వారా నెట్ బ్యాంకింగ్ ద్వారా లేదా ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింవచ్చు. https://cets.apsche.ap.gov.in/APSCHE/OAMDC24/OAMDCHome.html
ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్విభజనకు ముందు ఉన్న జోన్ల వారీగా అడ్మిషన్లను చేపడతారు. యూనివర్శిటీల వారీగా కాలేజీల కేటాయింపు ఉంటుంది. పూర్తి వివరాలు, అడ్మిషన్ ప్రక్రియ గురించి అడ్మిషన్ నోటిఫికేషన్ పరిశీలించండి.