CM Jagan Vizag Tour: విశాఖకు సీఎం జగన్... 3 రోజుల షెడ్యూల్ ఇదే
CM Jagan Visakhapatnam Tour Schedule: సీఎం జగన్ విశాఖ టూర్ ఖరారైంది. గురువారం నుంచి మూడు రోజుల పాటు విశాఖపట్నంలో పర్యటించనున్నారు.
CM Jagan Visakhapatnam Tour: ముఖ్యమంత్రి జగన్...విశాఖపట్నం పర్యటన ఖరారైంది. వైజాగ్ వేదికగా జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ లో భాగంగా.. ఆయన వైజాగ్ వెళ్లనున్నారు. గురువారం నుంచి మూడు రోజుల పాటు అక్కడే పర్యటించనున్నారు. మార్చి 3,4 తేదీల్లో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ముఖ్యమంత్రి పాల్గొంటారు.
గురువారం(మార్చి 2) సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 5.15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు ముఖ్యమంత్రి జగన్. రాత్రికి అక్కడే బస చేస్తారు. 3వ తేదీన ఉదయం 9.10 గంటలకు ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. అక్కడ జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో పాల్గొంటారు. రాత్రి 08.00 గంటల తర్వాత ఎంజీఎం పార్క్ హోటల్‌లో జీఐఎస్ డెలిగేట్స్‌కు ఏర్పాటు చేసిన ప్రత్యేక విందు కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం రాత్రి బస చేయనున్నారు.
మార్చి 4వ తేదీన ఉదయం 9.10 గంటలకు ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్‌కు చేరుకుని రెండో రోజు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో సీఎం పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 3.40 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. దీంతో ముఖ్యమంత్రి జగన్ విశాఖ పర్యటన ముగుస్తుంది.
విశాఖ వేదికగా నిర్వహించబోయే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు సిద్ధమైంది. మార్చి 3, 4వ తేదీల్లో నిర్వహించనున్న ఈ సదస్సుకు సాగర తీర నగరంలో విస్తృ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో.. దేశంలోని ప్రముఖ కార్పొరేట్ దిగ్గజ కంపెనీలు భాగస్వామ్యం కాబోతున్నాయి. ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, కేఎం బిర్లా, సజ్జన్ జిందాల్, సంజీవ్ బజాజ్, నవీన్ జిందాల్‌తో పాటూ పలువురు ప్రముఖులు తొలి రోజు జరిగే ప్రారంభ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ సదస్సు కోసం ప్రపంచ దేశాల నుంచి 250 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ఒక్కొక్క జీ–20 సభ్యదేశం నుంచి 6గురు చొప్పున పాల్గొంటారు. అంతర్జాతీయ సంస్థల నుంచి నలుగురు చొప్పున హాజరుకాగా... కేంద్ర ప్రభుత్వం నుంచి మరో 100 మంది ప్రతినిధులు పాల్గొంటారు. మార్చి 28–29 మధ్య ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూపు సమావేశం ఉంటుంది.
ఈ సమ్మిట్ ద్వారా ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, అనుకూల వాతారణం గురించి వివరించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. పలువురు పారిశ్రామికవేత్తలు తమ యూనిట్లను రాష్ట్రంలో ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వంతో కొన్ని ఒప్పందాలు చేసుకోబోయే అవకాశం కూడా ఉంది.
సంబంధిత కథనం