Global Investor Summit : గ్లోబల్ ఇన్వెస్టర్ల మీట్ కు విస్తృత ఏర్పాట్లు-andhrapradesh government conducts global investors summit in visakhapatnam march 3 and 4 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
Telugu News  /  Andhra Pradesh  /  Andhrapradesh Government Conducts Global Investors Summit In Visakhapatnam March 3 And 4

Global Investor Summit : గ్లోబల్ ఇన్వెస్టర్ల మీట్ కు విస్తృత ఏర్పాట్లు

గ్లోబల్ ఇన్వెస్టర్  సమ్మిట్ ‌పై సమీక్ష నిర్వహిస్తున్న సిఎస్ జవహర్ రెడ్డి
గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ‌పై సమీక్ష నిర్వహిస్తున్న సిఎస్ జవహర్ రెడ్డి

Global Investor Summitమార్చి3,4 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్ల మీట్ కు విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని సిఎస్ జవహార్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. ఏయూ ఇంజినీరింగ్ కాలేజీగ్రౌండ్స్‌లో జరిగే సదస్సు నిర్వహణపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

Global Investor Summit విశాఖలో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌కు ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. మార్చి 3,4 తేదీల్లో విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళశాల మైదానంలో జరగనున్నగ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ -ప్రపంచ పెట్టుబడి దారుల సదస్సుకు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు

గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సుకు సంబంధించిన 3వ వర్కింగ్ కమిటీ సమావేశం సిఎస్ అధ్యక్షతన జరిగింది. మార్చి3,4తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సును విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పెద్ద ఎత్తున్న విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు.ఈ సదస్సులో పాల్గొనే పలువురు కేంద్ర,రాష్ట్ర మంత్రులు,వివిధ జాతీయ అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు,ఇతర డెలిగేట్లు,తదితరులు అందరికీ ఆహ్వాన పత్రాలు అందించండంతో పాటు వారికి ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం తగిన రవాణా,వసతి వంటి అన్నిఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను సిఎస్ ఆదేశించారు.

రెండు రోజులపాటు జరగనున్నఈగ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సుల్లో వివిధ సెక్టార్లపై పెద్ద ఎత్తున చర్చ జరగనుందని జవహర్ రెడ్డి చెప్పారు. ముఖ్యంగా ఏరో స్పేష్ అండ్ డిఫెన్సు, అగ్రి అండ్ పుడ్ ప్రాసెసింగ్,ఏరోనాటికల్ అండ్ ఎలక్ట్రానిక్ వాహనాలు,హెల్తు కేర్ అండ్ మెడికల్ ఇక్విప్మెంట్, ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్ ఇన్ప్రాస్ట్రక్చర్, పెట్రో అండ్ పెట్రో కెమికల్స్,రెన్యువల్ ఎనర్జీ,ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్,టెక్స్టైల్స్ అండ్ అపారెల్స్, టూరిజం,స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్, ఎలక్ట్రానిక్స్, స్టార్టప్స్ అండ్ ఇన్నోవేషన్, ఐటి అండ్ జిసిసి వంటి రంగాలపై పెద్దఎత్తున చర్చ జరగనుందని సిఎస్ పేర్కొన్నారు.ప్రతి రంగంలోను చర్చకు సంబంధించి ఇతర ప్రతినిధులతోపాటు ఇద్దరు అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొనేలా చూడాలని చెప్పారు.

గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ కు సంబంధించి ఈనెల 14వతేదీన బెంగుళూరు లోను, 17న చెన్నెలోను, 20న ముంబై లోను, 24న హైదరాబాదులో డొమెస్టిక్ రోడ్డు షోలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సదస్సుకు వచ్చే ఆహ్వానితులందరికీ త్వరితగతిన ఆహ్వాన పత్రికలు అందించే ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు సదస్సులో పాల్గొన్నఆహ్వానితులుకు జ్ణాపికలు అందించేందుకు వీలుగా జ్ణాపికల ఎంపికను కూడా త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు విజయవంతానికి సంబంధించి పలు అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులతో సమీక్షించారు.