YSR Cheyuta : కుప్పంకు చంద్రబాబు నాన్ లోకల్… చేసిందేమి లేదన్న జగన్
YSR Cheyuta వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ చేయూత 4949కోట్ల రుపాయల నగదును 26,39,706మంది మహిళల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు ముఖయమంత్రి జగన్ చెప్పారు. చిత్తూరు జిల్లా కుప్పంలో నిర్వహించిన కార్యక్రమంలో సిఎం పాల్గొన్నారు. ప్రతి మండలంలో వారం రోజుల పాటు చేయూత ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి మండలంలో ప్రజాప్రతినిధులు, సర్పంచిలు, ఎంపీపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అన్ని స్థాయిల ప్రజా ప్రతినిధులు మండలాలకు వచ్చి వైఎస్సార్ చేయూత పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు.
YSR Cheyuta మూడో విడత చేయూత నగదు పంపిణీ కార్యక్రమం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో నిర్వహించారు. ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధ‌్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గంలో తొలిసారి ముఖ్యమంత్రి జగన్ బహిరంగ సభలో పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్సీ భరత్‌ను గెలిపించాలని సిఎం నియోజక వర్గ ప్రజలకు సూచిం్చారు.
వైఎస్సార్ చేయూత ద్వారా తమ జీవితాల్లో వచ్చిన మార్పు గురించి ప్రతి ఒక్కరు అన్ని మండలాల్లో జరిగే కార్యక్రమాల్లో వివరిస్తారని చెప్పారు. రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో ప్రతి ఒక్కరికి రూ.75వేలు వైఎస్సార్ చేయూత ద్వారా ఆర్ధిక సాయం అందిస్తున్నట్లు చెప్పారు. మూడో విడత పంపిణీ ద్వారా ఇప్పటి వరకు రూ.56వేలు చెల్లించినట్లు చెప్పారు.
పెన్షన్లను రూ.3వేలు చెల్లిస్తామనే మాటను నిలబెట్టుకుంటానని సిఎం చెప్పారు. వైఎస్సార్ చేయూత ద్వారా 26.39లక్షల మందికి దాదాపు రూ.5వేల కోట్ల రుపాయలు చెల్లిస్తున్నట్లు చెప్పారు. 39నెలల కాలంలో రాష్ట్ర ప్రజలకు చేయూత కార్యక్రమం ద్వారా రూ.14,110కోట్ల రుపాయలు పంపిణీ చేసినట్లు చెప్పారు. క్రమం తప్పకుండా వరుసగా పేదమహిళలకు రూ.56.250రుపాయలు అందించినట్లు చెప్పారు.
YSR Cheyuta 45-60ఏళ్ళ లోపు ప్రతి మహిళకు చేయూత కార్యక్రమంలో మేలు జరుగుతోందని, 60ఏళ్లు నిండిన వారు పెన్షన్ జాబితాలోకి వెళ్తారని, కొత్తగా అర్హత సాధించిన వారికి చేయూత అందుతుందన్నారు. అమ్మఒడి ద్వారా 44.50లక్షల మందికి 19,617 కోట్ల రుపాయలు చెల్లించినట్లు చెప్పారు, 79.74లక్షల మందికి వైఎస్సార్ ఆసరా ద్వారా 39నెలల్లో 12,758కోట్లు చెల్లించినట్లు సిఎం చెప్పారు. ఆసరాలో ఉన్న కోటిమందికి అక్క చెల్లెళ్లకు సున్న వడ్డీ పథకం ద్వారా రూ.3,615కోట్ల రుపాయలు చెల్లించినట్లు చెప్పారు. 39నెలల కాలంలో రూ.51వేల కోట్ల రుపాయలు అక్క చెల్లెళ్లకు పంపిణీ చేసినట్లు జగన్ చెప్పారు. ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల ద్వారా నాలుగేళ్లలో ఎలాంటి వివక్ష లేకుండా అందరికి డబ్బు బదిలీ జరుగుతోందని చెప్పారు. అన్ని రకాల పథకాల ద్వారా మహిళలకు రూ.1,15,651కోట్లు బదిలీ చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో అన్ని రకాల పథకాలకు నేరుగా నగదు పంపి 1,71,244కోట్ల రుపాయలు పంపిణీ చేసినట్లు సిఎం జగన్ కుప్పంలో చెప్పారు.
గతంలో పాలనకు ప్రస్తుత పాలనకు తేడా చూడాలని కోరారు. నాన్ డిబిటి పథకాల ద్వారా ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణాలు, సంపూర్ణ పోషణ, గోరుముద్ద, విద్యాకానుక, జగనన్న తోడు కార్యక్రమాలను కూడా కలిపితే రూ.లక్షా 41వేల కోట్లు ఉన్నాయని, డిబిటి, నాన్ డిబిటి పథకాల ద్వారా రూ.3,12,764 కోట్ల రుపాయలను ప్రతి కుటుంబానికి లబ్ది చేకూర్చినట్లు చెప్పారు. 2.39లక్షల కోట్ల రుపాయల విలువైన ప్రయోజనాలు మహిళలకు అందాయని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 31లక్షల మంది మహిళలకు 2-3లక్షల కోట్ల విలువైన ఇళ్ళ స్థలాలు, ఇంటి పట్టాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. ఒక్కో ఇంటి స్థలం, ఇంటి విలువ ఐదారు లక్షలకు తక్కువ ఉండదని చెప్పారు.
చంద్రబాబు చేసిన అప్పుల కంటే తమ ప్రభుత్వం అప్పులు తక్కువ చేసినా అప్పుడు లేని సంక్షేమం ఇప్పుడు ఎందుకు అమలవుతుందో చెప్పాలన్నారు. చంద్రబాబు హయంలో అందని సంక్షేమాన్ని ఇప్పుడు ఎలా అందించగలుగుతున్నామో ప్రజలు తెలుసుకోవాలన్నారు.
కుప్పం ఎమ్మెల్యే నాన్ లోకల్… హైదరాబాద్ లోకల్…..
కుప్పం నియోజక వర్గానికి చంద్రబాబు ఏమి చేయలేదని సిఎం ఆరోపించారు. 45ఏళ్ల రాజకీయ జీవితంలో 33ఏళ్లు కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నా నియోజకవర్గానికి మాత్రం ఏమి చేయలేదని ఆరోపించారు. కుప్పం నుంచి తీసుకోవడమే తప్ప ఏమి చేయలేదని విమర్శించారు. కుప్పంకు నీరు తీసుకురావాల్సిన హంద్రీనీవా నీటిని తీసుకువచ్చే కాంట్రాక్టులు తన వారికి ఇచ్చుకున్నాడని ఆరోపించారు. రూరల్ వాటర్ సప్లై పేరుతో దొంగ ట్యాంకర్లు పెట్టి దోచేశారని ఆరోపించారు. ట్రాక్టర్లు లేకుండా నీరు సరఫరా చేసేందుకు ఎప్పుడు ఆలోచించలేదని విమర్శించారు. కుప్పం అభివృద్ధి చెందితే ప్రజలు తన మాట వినరని ఆ ప్రాంతాన్ని బాగు చేయలేదని ఆరోపించారు. కుప్పం నుంచి బెంగళూరు, చెన్నై వలస వెళుతున్నా వారికి ఉద్యోగాలు చూపించే ఆలోచన రాలేదని తప్పు పట్టారు.
32ఏళ్లుగా గెలిపిస్తున్న కుప్పం ప్రజలకు జగన్ చేసినంత మేలు చందబాబు చేయలేదని మంత్రి పెద్ది రెడ్డి అన్నారు. కుప్పంలో భరత్‌ను ఆశీర్వదించాలని మంత్రి పెద్దిరెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కుప్పంలో భరత్‌ను గెలిపిస్తే మంత్రిని చేస్తానని సిఎం హామీ ఇచ్చారని ప్రజలు దానిని నెరవేర్చాలన్నారు.