Annamayya Road Accident : అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- స్కార్పియో, లారీ ఢీ, ఐదుగురు మృతి
Annamayya Road Accident : అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-స్కార్పియో ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందారు.
Annamayya Road Accident : అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident)జరిగింది. మదనపల్లె(Madanapalle) మండలం బార్లపల్లె సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని స్కార్పియో(Lorry Car accident) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెదారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. అతి వేగంగా వచ్చిన స్కార్పియో లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. మృతుల వివరాలు సేకరించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. ప్రమాదంలో మరణించిన ఐదుగురు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో మదనపల్లె-బెంగలూరు రోడ్డుపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే స్కార్పియో అతి వేగంగా వచ్చి ముందు బైక్ ను ఢీకొట్టింది. బైక్ పై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. అక్కడి నుంచి పరారయ్యే క్రమంలో స్కార్పియో లారీని ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ముగ్గురు మృతిచెందారు.
నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం
నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఎరసానిగూడెం వద్ద ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై అతి వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. అనంతరం ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది.
బిహార్ లో
బిహార్రాష్ట్రం కైమూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో 9 మంది దుర్మరణం చెందారు. మోహానియా పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిలో దేవకాలి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సంబంధిత కథనం