Road accident : ఘోర రోడ్డు ప్రమాదం.. కారును ఢీకొట్టిన బస్సు- మంటల్లో ఐదుగురు సజీవ దహనం!
Uttar Pradesh road accident today : యూపీలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు- ఓ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు.. అగ్నికి ఆహుతైపోయారు!
Uttar Pradesh road accident death toll : ఉత్తర్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహావన్ ప్రాంతంలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వే మీద ఓ బస్సు.. ఓ కారును ఢీకొట్టింది. ఆ వెంటనే రెండు వాహనాల్లోనూ మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో.. మంటల్లో చిక్కుకుపోయిన ఐదుగురు సజీవ దహనం అయ్యారు. ఇంకొందరికి స్వల్పంగా గాయాలయ్యాయి.
ఇదీ జరిగింది..
మథురాలోని మహావన్ ప్రాంతంలో ఉన్న యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై సోమవారం ఉదయం జరిగింది ఈ ఘటన. 40 ప్రయాణికులతో కూడిన ఓ బస్సు బిహార్ నుంచి దిల్లీకి వెళుతుండగా.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తొలుత.. ఆ బస్సు డివైడర్ని తాకిందని, అనంతరం ఓ కారును ఢీకొట్టిందని సమచారం. ఆ సమయంలో.. కారులో ఐదుగురు ఉన్నారు.
Yamuna Expressway road accident today : బస్సు.. కారును ఢీకొట్టిన వెంటనే.. రెండు వాహనాల్లోనూ మంటలు చెలరేగాయి. కాగా.. బస్సులోని ప్రయాణికులందరు సురక్షితంగా బయటపడ్డారు. కానీ కారులో ఉన్న ఐదుగురు.. సమయానికి బయటకు రాలేకపోయారు. ఫలితంగా.. వారందరు అగ్నికి ఆహుతైపోయారు.
"కిషన్పూర్ గ్రామం వద్ద ఉన్న మైల్స్టోన్ 10 సమీపంలో యమునా ఎక్స్‌ప్రెస్ వేపై సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సుపై డ్రైవర్ కంట్రోల్ కోల్పోయాడు. తొలుత డివైడర్ని ఢీకొట్టాడు. అనంతరం కారుపైకి ఆ బస్సు దూసుకెళ్లింది. వెంటనే రెండు వాహనాల నుంచి మంటలు చెలరేగాయి. కారులో ఉన్న ఐదుగురు మరణించారు," అని పోలీసులు వెల్లడించారు.
Uttar Pradesh road accident today : అయితే.. అగ్నిమాపక సిబ్బంది, సమయానికి ఘటనాస్థలానికి చేరుకోలేదని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఘటన జరిగిన 30 నిమిషాల తర్వాత కూడా అగ్నిమాపక వాహనాలు కనిపించలేదని అన్నారు. ఆ తర్వాతే.. అగ్నిమాపక సిబ్బంది వచ్చారని, మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నించారని వివరించారు.
యుమనా ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. బాధితులకు మెరుగైన వసతి అందివ్వాలని అధికారులకు ఆదేశించినట్టు స్పష్టం చేశారు.
ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు.
యమునా ఎక్స్‌ప్రెస్‌వే.. భయం-భయం!
Mathura road accident : రోడ్డు ప్రమాదాలతో ఇటీవలి కాలంలో వార్తల్లో నిలుస్తోంది యమునా ఎక్స్‌ప్రెస్‌వే. గత నెలలో, ఇదే ఎక్స్‌ప్రెస్‌వేపై రెండు బస్సులు పరస్పరం ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ 40మంది గాయపడ్డారు.
ఈ యమునా ఎక్స్‌ప్రెస్‌వే.. దేశంలో 6వ అతిపెద్ద ఎక్స్‌ప్రెస్‌వే. ఆగ్రా నుంచి గ్రేటర్ నోయిడా మధ్య ఉన్న 165.5 కి.మీల దూరాన్ని ఇది కవర్ చేస్తుంది.
సంబంధిత కథనం