APPSC Group 1 Prelims : రేపే ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్, 301 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహణ- సీఎస్ జవహర్ రెడ్డి-amravati appsc group 1 prelims conducting 301 exam centers says cs jawahar reddy ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Appsc Group 1 Prelims : రేపే ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్, 301 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహణ- సీఎస్ జవహర్ రెడ్డి

APPSC Group 1 Prelims : రేపే ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్, 301 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహణ- సీఎస్ జవహర్ రెడ్డి

Bandaru Satyaprasad HT Telugu
Mar 16, 2024 07:19 PM IST

APPSC Group 1 Prelims : ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సీఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 301 పరీక్షా కేంద్రాల్లో ప్రిలిమ్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్
ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్

APPSC Group 1 Prelims : ఈనెల 17న(ఆదివారం) నిర్వహించే ఏపీపీఎస్సీ గ్రూపు-1 స్క్రీనింగ్(APPSC Group 1 Prelims) పరీక్షకు విస్తృతమైన ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి(CS Jawahar Reddy) పేర్కొన్నారు. గ్రూపు-1 ప్రిలిమ్స్ ఏర్పాట్లపై శనివారం సీఎస్ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ... ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా 301 కేంద్రాల్లో గ్రూప్-1 ప్రిలిమ్స్(AP Group 1) పరీక్షలు జరగనున్నాయని తెలిపారు. మొత్తం 1,48,881 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారని చెప్పారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గం.ల వరకూ పేపర్-1, మధ్యాహ్నం 2 గం.ల నుంచి సాయంత్రం 4 గం.ల వరకూ పేపర్-2 పరీక్ష జరుగుతుందని సీఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు.

పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్

గ్రూపు-1 పరీక్షలు జరిగే పరీక్షా కేంద్రాల పరిధిలో 144వ సెక్షన్ విధించి ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. ప్రతీ పరీక్ష కేంద్రం(Exam Centers) వద్ద ఇద్దరు పురుష, ఇద్దరు మహిళా పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. అంతే గాక పరీక్షల పర్యవేక్షణకు ప్రతి జిల్లాకు ఒక ఐఏఎస్ అధికారిని ఇన్ ఛార్జ్ గా నియమించామని తెలిపారు. ప్రతీ పరీక్షా కేంద్రానికి జిల్లా స్థాయి సీనియర్ అధికారులను లైజన్ అధికారులుగా నియమించి పరీక్షలు సజావుగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు.

కంట్రోల్ రూమ్ ద్వారా ఏపీపీఎస్సీ అధికారుల పర్యవేక్షణ

అన్ని పరీక్షా కేంద్రాల్లోనూ విద్యుత్ సరఫరా, తాగునీరు వంటి కనీస సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలని సీఎస్ జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అంతేగాక ప్రథమ చికిత్స సౌకర్యాన్ని అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను సీఎస్ ఆదేశించారు. రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్ ద్వారా పరీక్షలు (AP Group 1 Prelims)జరుగుతున్న తీరును నిరంతరం పర్యవేక్షించాలని ఏపీపీఎస్సీ అధికారులను సీఎస్ ఆదేశించారు. అలాగే జిల్లాల్లో కూడా కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. పరీక్ష అనంతరం ఆన్సర్ సీట్లు ఇతర సామాగ్రి కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్ లకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అభ్యర్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకూడదని, ఇలా ఎవరైనా తీసుకొచ్చి పరీక్ష కేంద్రంలో పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని ఏపీపీఎస్సీ హెచ్చిరించింది.

Whats_app_banner

సంబంధిత కథనం