AP DSC 2024: ఏపీ డిఎస్సీ 2024 షెడ్యూల్‌లో మార్పులు, మార్చి 25 నుంచి హాల్ టిక్కెట్లు, మార్చి 30 నుంచి పరీక్షలు…
AP DSC 2024: ఏపీలో డిఎస్సీ 2024 షెడ్యూల్‌లో మార్పులు చేసినట్టు విద్యాశాఖ మంత్రి బొత్స Botsa సత్యనారాయణ ప్రకటించారు. మార్చి 25వ తేదీ నుంచి హాల్ టిక్కెట్లను జారీ చేయనున్నట్లు ప్రకటించారు. మార్చి 30 నుంచి పరీక్షలు జరుగనున్నాయి.
AP DSC 2024: ఆంధ్రప్రదేశ్ డిఎస్సీ-2024 షెడ్యూల్ లో మార్పులు చేసినట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. మార్చి 25 వ తేదీ నుంచి హాల్ టిక్కెట్లు Hall Tickets డౌన్ లోడ్ చేసుకోవచ్చన్నారు.
మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు డిఎస్సీ 2024 పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. 14 రోజుల పాటు రెండు సెషన్స్ లలో పరీక్షల్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఎస్జీటీ SGT Posts పోస్టులకు బిఇడి అభ్యర్థుల అనుమతించే విషయంలో హైకోర్టు Hogh Court అభ్యంతరాల నేపథ్యంలో విద్యాశాఖ పరీక్షల నిర్వహణలో మార్పులు చేసింది.
రాష్ట్రంలో 6100 ఉపాధ్యాయుల నియామకం కోసం ప్రకటించిన డిఎస్సీ-2024 పరీక్షల షెడ్యూల్ లో మార్పులు చేసినట్లు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. డిఎస్సీ-2024 పరీక్ష కోసం ఫిబ్రవరి 25 వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించారు.
ముందు ప్రకటించిన ప్రకారం మార్చి 15 వ తేదీ నుంచి డిఎస్సీ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. సాంకేతిక కారణాలతో పాటు ఇతర ఇబ్బందులతో పరీక్షలను మార్చి 30 వ తేదీ నుంచి ఏప్రిల్ 30 వరకు నిర్వహిస్తున్నామని మంగళవారం మంత్రి బొత్స ప్రకటించారు.
మొత్తం 14 రోజుల పాటు రెండు సెషన్స్ లలో పరీక్షలను నిర్వహించేలా టైం టేబుల్ ను రూపొందించినట్టు చెప్పారు. డిఎస్పీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న వారు షెడ్యూల్ మార్పును గమనించాలని ఆయన సూచించారు.
సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు(ఎస్జీటీ) అర్హతలను మార్చడం, టెట్ పరీక్షకు డిఎస్సీ పరీక్షకు మధ్యన తగిన సమయం ఇవ్వడం తదితర కారణాల వల్ల షెడ్యూల్ లో మార్పులు అనివార్యమయ్యాయని మంత్రి వివరించారు.
సెంటర్లను ఎంపిక చేసుకోడానికి మార్చి 20 నుంచి వెబ్ ఆప్షన్లు ద్వారా అభ్యర్ధులకు అవకాశం కల్పిస్తున్నామని, హాల్ టిక్కెట్లను మార్చి 25 వ తేదీ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. నూతన షెడ్యూల్ ద్వారా లభించిన అవకాశాన్ని అభ్యర్ధులంతా సద్వినియోగం చేసుకుని పరీక్షలకు సిద్ధం కావాలని మంత్రి బొత్స సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు.
సంబంధిత కథనం