AP DSC Notification : నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, సంక్రాంతి తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్
AP DSC Notification : ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి పండుగ తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి బొత్స తెలిపారు.
AP DSC Notification : నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. డీఎస్సీ గురించి ఇప్పుటికే సీఎం జగన్ తో చర్చించామన్నారు. త్వరలో వివరాలను తెలియజేస్తామన్నారు. ఎన్ని ఉద్యోగాల భర్తీ, విధి విధానాలను త్వరలో వెల్లడిస్తామన్నారు. ఇప్పటికే సీఎం డీఎస్సీపై చర్చించామని, సంక్రాంతి కానుకగా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్తామన్నారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం గ్రూప్-1, 2 నోటిఫికేషన్లు విడుదల చేసింది. వీటి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది.
డీఎస్సీ నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. డీఎస్సీపై విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే వచ్చే నెలలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలోనే డీఎస్సీ ప్రక్రియ ముందుకు సాగనుంది. అయితే డీఎస్సీ నోటిఫికేషన్ మాత్రం ఈ నెలలోనే ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దశలవారీగా టీచర్ ఉద్యోగాల భర్తీ చేయాలని నిర్ణయించింది.
గ్రూప్-1, 2 దరఖాస్తు ప్రక్రియ
ఏపీపీఎస్సీ గ్రూప్ -2 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 897 పోస్టులతో గ్రూప్ -2 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఎగ్జిక్యూటివ్ పోస్టులు-331..... నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు- 566 ఉన్నాయి. ఫిబ్రవరి 25వ తేదీన ప్రిలిమనరీ పరీక్ష ఉంటుందని తెలిపింది. డిసెంబర్ 21 నుంచి జనవరి 10 వరకు ధరఖాస్తుల స్వీకరణ ఉంటుందని వెల్లడించింది. తాజాగా దరఖాస్తు గడువును జనవరి 17కు పెంచింది.
ఏపీపీఎస్సీ గ్రూప్-1 సర్వీస్-2024 రిజిస్ట్రేషన్ ప్రక్రియను జనవరి 1 నుంచి ప్రారంభించింది. గ్రూప్-1 పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ psc.ap.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 81 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు జనవరి 21 చివరి తేదీ. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు దేశంలోని ఏదైనా విశ్వవిద్యాలయం గుర్తింపు పొందిన బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 17న గ్రూప్-1 పోస్టుల భర్తీకి ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు.