AP ICET 2024 : ఏపీ ఐసెట్ నోటిఫికేషన్ విడుదల, ముఖ్యమైన తేదీలివే!-amaravati news in telugu ap icet 2024 notification released important dates ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Icet 2024 : ఏపీ ఐసెట్ నోటిఫికేషన్ విడుదల, ముఖ్యమైన తేదీలివే!

AP ICET 2024 : ఏపీ ఐసెట్ నోటిఫికేషన్ విడుదల, ముఖ్యమైన తేదీలివే!

Bandaru Satyaprasad HT Telugu
Mar 03, 2024 04:24 PM IST

AP ICET 2024 : ఏపీ ఐసెట్ నోటిఫికేషన్ ను శ్రీ కృష్ణ దేవరాయ యూనివర్సిటీ విడుదల చేసింది. మార్చి 6 నుంచి అప్లికేషన్లు స్వీకరించనున్నారు.

ఏపీ ఐసెట్ నోటిఫికేషన్ విడుదల
ఏపీ ఐసెట్ నోటిఫికేషన్ విడుదల

AP ICET 2024 : ఏపీ ఐసెట్ నోటిఫికేషన్(AP ICET Notification) విడుదలైంది. రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 6 వ తేదీ నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకు అప్లికేషన్లు(AP ICET Application) స్వీకరించనున్నారు. మే 6, 7 తేదీల్లో రెండు సెషన్లలో ఐసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఓసీ అభ్యర్థులు రూ.650, బీసీలు రూ.600, ఎస్సీ, ఎస్టీలు రూ.550 ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది.

మార్చి 6 నుంచి అప్లికేషన్లు

ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం ఐసెట్ (AP ICET 2024) అధికారిక వెబ్‌సైట్ https://cets.apsche.ap.gov.in/లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ మార్చి 6వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. అనంతపురం శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఏపీ ఐసెట్ దరఖాస్తు ఫారమ్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేయనుంది. అర్హులైన అభ్యర్థులు కంప్యూటర్ ఆధారిత పరీక్ష కోసం ఆన్‌లైన్ ఫారమ్‌ను సమర్పించాలి. శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఐసెట్ 2024 పరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఆన్‌లైన్ మోడ్‌లో నిర్వహిస్తుంది. దీనిలో మూడు వేర్వేరు విభాగాల నుంచి మొత్తం 200 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది. నెటిగివ్ మార్కుల నిబంధన లేదు.

ఏపీ కామన్ ఎంట్రన్స్ పరీక్షల షెడ్యూల్

ఆంధ్రప్రదేశ్ లోని విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించి కామన్ ఎంట్రన్స్ పరీక్షల(AP CETs) తేదీలను ఉన్నత విద్యా మండలి ఇటీవల ప్రకటించింది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కేసుల్లో ప్రవేశాలకు నిర్వహించి ఏపీ ఈఏపీ సెట్ (AP EAPCET 2024) ను మే 13 నుంచి 19 వరకు నిర్వహించనున్నారు.

కామన్ ఎంట్రన్స్ పరీక్షల తేదీలు

  • ఏపీ ఐసెట్(AP ICET) - మే 6న
  • ఏపీ ఈసెట్(AP ECET) - మే 8న
  • ఏపీ పీజీఈసెట్(AP PGECET)- మే 29 నుంచి 31 వరకు
  • ఏపీ పీజీసెట్(AP PGCET)- జూన్ 3 నుంచి 7 వరకు
  • ఏపీ ఎడ్ సెట్(AP EdCET)- జూన్ 8న
  • ఏపీ లాసెట్(AP LAWCET) - జూన్ 9న
  • ఏపీ ఏడీసెట్(AP ADCET)- జూన్ 13న

ఏ సెట్ ఏ యూనివర్సిటీ నిర్వహణ

వచ్చే విద్యా సంవత్సరానికి(2024-25) ప్రవేశ పరీక్షల తేదీలు, నిర్వహించే యూనివర్సిటీలను ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది. ఏపీ ఈఏపీ సెట్ ను కాకినాడ జేఎన్టీయూ నిర్వహించనుంది. ఏపీ ఈసెట్(ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ను అనంతపురం జేఎన్టీయూ, ఐసెట్(ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశాలు)ను శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నిర్వహించనుంది. వెంకటేశ్వర యూనివర్సిటీ పీజీఈసెట్, ఆంధ్ర యూనివర్సిటీ (Andhra University) ఎడ్ సెట్‌ను, నాగార్జున యూనివర్సిటీ లా సెట్ ను నిర్వహించనున్నాయి. పీజీ సెట్‌ను ఆంధ్ర విశ్వవిద్యాలయం, పీఈ సెట్‌ను నాగార్జున విశ్వవిద్యాలయం నిర్వహించనున్నాయి. ఏపీ ఎడ్ సెట్‌ను వైఎస్సార్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా మండలి ప్రకటించింది.

Whats_app_banner

సంబంధిత కథనం