AP CETs Schedule : ఏపీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ల తేదీలు ఖరారు, EAPCET ఎప్పుడంటే!
AP CETs Schedule : ఏపీ ఉన్నత విద్యా మండలి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించి కామన్ ఎంట్రన్స్ పరీక్షల తేదీలు ప్రకటించింది. ఏపీ ఈఏపీ సెట్ ను మే 13 నుంచి 19 వరకు నిర్వహించనున్నారు.
AP CETs Schedule : ఆంధ్రప్రదేశ్ లోని విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించి కామన్ ఎంట్రన్స్ పరీక్షల(AP CETs) తేదీలను ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కేసుల్లో ప్రవేశాలకు నిర్వహించి ఏపీ ఈఏపీ సెట్ (AP EAPCET 2024) ను మే 13 నుంచి 19 వరకు నిర్వహించనున్నారు.
కామన్ ఎంట్రన్స్ పరీక్షల తేదీలు
- ఏపీ ఐసెట్(AP ICET) - మే 6న
- ఏపీ ఈసెట్(AP ECET) - మే 8న
- ఏపీ పీజీఈసెట్(AP PGECET)- మే 29 నుంచి 31 వరకు
- ఏపీ పీజీసెట్(AP PGCET)- జూన్ 3 నుంచి 7 వరకు
- ఏపీ ఎడ్ సెట్(AP EdCET)- జూన్ 8న
- ఏపీ లాసెట్(AP LAWCET) - జూన్ 9న
- ఏపీ ఏడీసెట్(AP ADCET)- జూన్ 13న
ఏ సెట్ ఏ యూనివర్సిటీ నిర్వహణ
వచ్చే విద్యా సంవత్సరానికి(2024-25) ప్రవేశ పరీక్షల తేదీలు, నిర్వహించే యూనివర్సిటీలను ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది. ఏపీ ఈఏపీ సెట్ ను కాకినాడ జేఎన్టీయూ నిర్వహించనుంది. ఏపీ ఈసెట్(ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ను అనంతపురం జేఎన్టీయూ, ఐసెట్(ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశాలు)ను శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నిర్వహించనుంది. వెంకటేశ్వర యూనివర్సిటీ పీజీఈసెట్, ఆంధ్ర యూనివర్సిటీ (Andhra Univesity) ఎడ్ సెట్‌ను, నాగార్జున యూనివర్సిటీ లా సెట్ ను నిర్వహించనున్నాయి. పీజీ సెట్‌ను ఆంధ్ర విశ్వవిద్యాలయం, పీఈ సెట్‌ను నాగార్జున విశ్వవిద్యాలయం నిర్వహించనున్నాయి. ఏపీ ఎడ్ సెట్‌ను వైఎస్సార్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా మండలి ప్రకటించింది.
తెలంగాణ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ల తేదీలు
తెలంగాణ ఈఏపీసెట్(EAPCET 2024) సహా పలు ఉమ్మడి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మే 9 నుంచి 12వ తేదీ వరకు టీఎస్ ఈఏపీసెట్ నిర్వహిస్తున్నట్లు సెట్ కన్వీనర్ దీన్ కుమార్ ప్రకటించారు. ఈ నెల 21న టీఎస్ ఈఏపీసెట్-2024 నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈసారి ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం సిలబస్‌ను వందశాతం అమలు చేస్తామని కన్వీనర్ పేర్కొన్నారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి 2024-25 విద్యాసంవత్సరానికి ఈఏపీ సెట్ నిర్వహించనున్నారు. టీఎస్ ఈఏపీసెట్-2024 నోటిఫికేషన్ ఫిబ్రవరి 21న విడుదలకానుంది. ఫిబ్రవరి 26 నుంచి ఏప్రిల్ 6 వరకు విద్యార్థుల నుంచి అప్లికేషన్లు స్వీకరించనున్నారు. మే 9 నుంచి 12 వరకు ఆన్ లైన్ లో పరీక్షలు నిర్వహిస్తారు. మే 9 నుంచి 11 వరకు ఇంజినీరింగ్ కోర్సులకు, మే 12న అగ్రికల్చర్, ఫార్మా కోర్సులకు ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు.
కామన్ ఎంట్రెన్స్ పరీక్షల షెడ్యూల్
- టీఎస్ ఈసెట్ -మే 6
- టీఎస్ ఎడ్‌సెట్ - మే 23 న
- టీఎస్ లా సెట్ - జూన్ 3
- టీఎస్‌పీజీ సెట్-జూన్ 6 నుంచి 9 వరకు
- టీఎస్ ఐసెట్- జూన్ 4, 5
- టీఎస్ పీఈసెట్- జూన్ 10 నుంచి 13 వరకు
- టీఎస్ పీజీఈసెట్-జూన్ 6 నుంచి 8 వరకు
సంబంధిత కథనం