AP Fishing Ban : ఏపీలో ఏప్రిల్ 15 నుంచి చేపల వేట నిషేధం, ఫిషింగ్ బోట్లకు నో పర్మిషన్
AP Fishing Ban : ఏపీతో సహా తూర్పు తీరంలో 61 రోజుల పాటు చేపల వేటపై నిషేధం విధించింది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది.
AP Fishing Ban : ఏపీ తీర ప్రాంతాల్లో చేపల వేటపై నిషేధం(AP Fishing Ban) విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మత్స్య సంపద వృద్ధి, పరిరక్షణలో భాగంగా తూర్పు తీర ప్రాంతంలో ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు రెండు నెలల పాటు చేపల వేటపై నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర మత్స్యశాఖ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. మత్స్య సంపద పునరుత్పత్తి సమయం కావడంతో ఏటా ఏప్రిల్, జూన్ నెల మధ్య 61 రోజుల పాటు చేపల వేటను ప్రభుత్వాలు నిషేధం విధిస్తాయి. సముద్రంలోకి సాధారణ బోట్లు మినహా మోటారు, ఫిషింగ్ బోట్లను(Fishing Boats) నిషేధిత సమయాల్లో వేటకు అనుమతించరు. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) తో పాటు తూర్పుతీర ప్రాంతంలోని రాష్ట్రాల్లో వేట నిషేధం విధించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల(Union Govt) మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది.
వేట నిషేధం ఎందుకంటే?
సముద్ర జలాల్లో చేపల వేట నిషేధం ముఖ్య ఉద్దేశం... పలు రకాల చేప, రొయ్య జాతుల సంతానోత్పత్తి అని అధికారులు తెలిపారు. ఈ కాలంలో తల్లి చేపలను, రొయ్యల సంరక్షణ, వాటి సంతతి పెరుగుదలను ప్రోత్సహించేందుకు ఏటా వేట నిషేధం విధిస్తామన్నారు. దీంతో సముద్ర మత్స్య సంపద పెరుగుతోందన్నారు. ఈ నిషేధ ఉత్తర్వులను పాటిస్తూ ఆ సమయంలో సముద్ర జలాల్లో మెకనైజ్డ్, మోటారు బోట్లపై మత్స్యకారులు ఎలాంటి చేపల వేట చేయకుండా మత్స్య అభివృద్ధికి సహకరించాలని అధికారులు కోరారు. అయితే వేప నిషేధం సమయంలో స్థానిక ప్రభుత్వాలు మత్స్యకారులకు ఆర్థిక సాయం అందిస్తుంటాయి. అయితే ఈసారి ఎన్నికల కోడో కారణంగా ఆర్థిక సాయం నిలిచిపోనుంది. ఇందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలని మత్స్యకారులు కోరుతున్నారు.
మత్స్యకారులకు ఆర్థిక సాయం
ప్రతి ఏటా రెండు నెలల పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం చేపల వేటపై నిషేధం (Fishing Ban )విధిస్తాయి. చేపల పెంపకం, పునరుత్పత్తి లక్ష్యంగా ప్రతీ ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు చేపల వేటపై నిషేధం విధిస్తాయి. ఈ సమయంలో మత్స్యకారుల జీవనోపాధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేలు (Financial Assistance for Fishermen)అందిస్తుంది. గతంలో రూ.4 వేల ఇచ్చేవారు. ప్రభుత్వం ప్రభుత్వం రూ.10 వేల అందిస్తుంది. దీంతో పాటు డీజిల్ పై రాయితీని అందిస్తారు.
చేపల పట్టేందుకు వెళ్లి ఇద్దరు మృతి
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా(Rangareddy)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చెరువులో చేపల వేటకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం మక్తగూడలో జరిగింది. స్థానికులు, పోలీసులు వివరాల ప్రకారం... మక్తగూడ గ్రామానికి చెందిన కిష్టయ్య, వెంకటేష్ అనే ఇద్దరు యువకులు చేపలు వేటకు(Fishing) సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు. చెరువులో చేపలు పట్టే క్రమంలో నీటిలో మునిగిపోయారు. వీరిని ఎవరూ గమనించకపోవడంతో మృతి చెందారు. ఈ ఘటనను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తు్న్నారు. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.