AP TG Rains : ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు- రేపు ఈ జిల్లాల్లో వానలు-amaravati ap tg rains next three days weather report moderate rains in these districts ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Tg Rains : ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు- రేపు ఈ జిల్లాల్లో వానలు

AP TG Rains : ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు- రేపు ఈ జిల్లాల్లో వానలు

Bandaru Satyaprasad HT Telugu
Published Jun 16, 2024 08:27 PM IST

AP TG Rains : ఉక్కపోతతో అల్లాడి పోతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.

ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు- రేపు ఈ జిల్లాల్లో వానలు
ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు- రేపు ఈ జిల్లాల్లో వానలు

AP TG Rains : నైరుతి రుతుపవనాలు, ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రేపు ఏపీలోని అల్లూరి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. అలాగే అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, సత్యసాయి, వైఎస్ఆర్ , అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువులు, గొర్రెల కాపరులు చెట్లు, పోల్స్, టవర్స్ కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని సూచించారు.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఆదివారం సాయంత్రం 6 గంటల నాటికి కాకినాడ రూరల్ లో 83 మి.మీ, ఏలూరు జిల్లా నిడమర్రులో 80.7 మి.మీ, విజయనగరంలో 70 మి.మీ, అల్లూరి జిల్లా కూనవరంలో 48.5 మి.మీ, తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో 47.5 మి.మీ, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో 45 మి.మీ, కృష్ణా జిల్లా పమిడిముక్కలలో 31.5 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైందని వాతావరణ కేంద్రం తెలిపింది.

వచ్చే మూడు రోజులు తెలంగాణలో వర్షాలు

తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాయలసీమ నుంచి పశ్చిమ, మధ్య బంగాళాఖాతం మీదుగా సముద్ర మట్టానికి 3.1- 5.8 కి.మీ ఎత్తులో ద్రోణి కొనసాగనుందని తెలిపింది. ద్రోణి ప్రభావంతో ఆదివారం నుంచి పలు జిల్లాల్లో భారీ వర్షాలు, కొన్ని జిల్లాలలో మోస్తారు వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

ఈ జిల్లాల్లో

నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి జిల్లాలలో ఉరుములు, మెరుపులతో గంటకు 30-40 కి.మీ ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, మహబూబాబాద్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

Whats_app_banner