తెలుగు న్యూస్ / ఫోటో /
Monsoon Enters AP : ఏపీని తాకిన నైరుతి రుతుపవనాలు, పలు జిల్లాల్లో వర్షాలు
- Monsoon Enters AP : నైరుతి రుతుపవనాలు ఏపీని తాకాయి. రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. ఏపీ అంతటా రుతుపవనాలు మరింత విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
- Monsoon Enters AP : నైరుతి రుతుపవనాలు ఏపీని తాకాయి. రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. ఏపీ అంతటా రుతుపవనాలు మరింత విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
(1 / 6)
నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ ను తాకాయి. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. (Pexels)
(2 / 6)
ఏపీ అంతటా రుతుపవనాలు మరింత విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. (Pexels)
(3 / 6)
ఏపీలో రానున్న మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. (Pexels)
(4 / 6)
కోస్తాంధ్ర ప్రాంతంలో ఆవర్తన ప్రభావంతో రాగల 3 రోజులు అక్కడక్కడా భారీవర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. (Pexels)
(5 / 6)
జూన్ ఏడో తేదీ నుంచి నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో మరింత విస్తరించే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు నైరుతి పవనాల రాక కాస్త ఉపశమనం కలిగించింది.
ఇతర గ్యాలరీలు