(1 / 6)
బంగాళాఖాతం మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో పాటు రుతుపవనాల విస్తరణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో మరో నాలుగైదు రోజులపాటు వానలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది
(image source @APSDMA)(2 / 6)
రాయలసీమ నుంచి మధ్య బంగాళాఖాతం వరకు సముద్రమట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఏర్పడిన ద్రోణి కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
(image source @APSDMA)(3 / 6)
ఆదివారం(జూన్ 16) నుంచి సోమవారం ఉదయం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అలాగే నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. 16 - 18 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, జూన్ 21వ తేదీ వరకు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
(image source @APSDMA)(4 / 6)
ఏపీకి కూడా వర్ష సూచన ఇచ్చింది ఐఎండీ. ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో రాబోయే 5 రోజులలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇవాళ(జూన్ 16) అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
(image source @APSDMA)(5 / 6)
రేపు(సోమవారం) అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
(6 / 6)
ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిచింది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు, పోల్స్, టవర్స్ కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించింది.శనివారం సాయంత్రం 6 గంటల నాటికి విజయనగరం జిల్లా దత్తిరాజేరులో 78.5 మి.మీ, బాడంగిలో 60.2 మి.మీ,కాకినాడ జిల్లా శంఖవరంలో 51.7 మి.మీ, విజయనగరం నెల్లిమర్లలో 37.5 మి.మీ, చీపురుపల్లిలో 37 మిమీ చొప్పున వర్షపాతం నమోదైందనట్లు వెల్లడించింది.
ఇతర గ్యాలరీలు