AP IAS Transfers : ఏపీలో అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. తాజాగా పలు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేస్తూ సీఎస్ నీరభ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
ఏపీ అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ హరేంధిర ప్రసాద్ కలెక్టర్ ను ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేసి విశాఖ జిల్లా మేజిస్ట్రేట్‌గా బదిలీ చేశారు. ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తన బాధ్యతలను అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పి.కోటేశ్వరరావుకు అప్పగించనున్నారు.
ఏపీలో జూన్ 19న భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. రాష్ట్రంలోని కీలక శాఖల్లో పనిచేస్తోన్న ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఇటీవల సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణలో అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. ఇటీవల 8 మంది ఐపీఎస్‌ల అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా సుభాష్ ను నియమించారు. కొత్తగూడెం ఓఎస్‌డీగా పరితోష్ పంకజ్, ములుగు ఓఎస్‌డీగా మహేష్ బాబాసాహెబ్, గవర్నర్ ఓఎస్‌డీగా సిరిశెట్టి సంకీర్త్, భద్రాచలం ఏఎస్పీగా అంకిత్ కుమార్ ను నియమించారు. భైంసా ఏఎస్పీగా అవినాష్ కుమార్, వేములవాడ ఏఎస్పీగా శేషాద్రిని రెడ్డి, ఏటూరునాగారం ఏఎస్పీగా శివమ్ ఉపాధ్యాయను నియమిస్తూ సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.
సంబంధిత కథనం