TSPSC EO Jobs Notification 2022: 181 పోస్టులకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్
30 August 2022, 10:24 IST
- TSPSC EO Jobs Notification 2022: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది.
181 పోస్టులకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్,
TSPSC EO Jobs Notification 2022: ఇప్పటికే గ్రూప్ -1 తో పాటు పలు నోటిఫికేషన్లు ఇచ్చిన టీఎస్పీఎస్సీ తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. మహిళా, శిశు సంక్షేమశాఖలో 181 పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. ఇందులో భాగంగా గ్రేడ్- 1 ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్(సూపర్ వైజర్) పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించింది. సెప్టెంబర్ 8 నుంచి 29 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
NOTE:
ఈ లింక్ పై క్లిక్ చేసి అధికారిక వెబ్ సైట్ నుంచి దరఖాస్తు చేసుకోవాలి
కొద్దిరోజుల కిందట ములుగు జిల్లాలోని అటవీ కళాశాలల్లో ఆచార్యుల భర్తీకి కూడా నోటిఫికేషన్ జారీ చేసింది టీఎస్పీఎస్సీ. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అటవీ కళాశాలల్లో 27 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. సెప్టెంబరు 6 నుంచి 27 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టీఎస్పీఎఎస్సీ నోటిఫికేషన్లో పేర్కొంది.
TSPSC Notification Released: ప్రొఫెసర్-02, అసోసియేట్ ప్రొఫెసర్-04, అసిస్టెంట్ ప్రొఫెసర్-21 పోస్టులను ఈ నోటిఫికేషన్లో భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో ఎంఎస్సీ మరియు పీహెచ్డీ (Ph.D) చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవాలి. ఎంపికైన వారికి నెలకు రూ.57,700 నుంచి రూ.1,44,200 వరకు వేతనం ఇస్తారు. విద్యార్హతలు, వేతనాలకు సంబంధించిన పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడండి. దరఖాస్తుదారుల వయస్సు 21 నుంచి 61 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం www.tspsc.gov.in వెబ్‌సైట్ వెళ్లాలి.
డీఏఓ గ్రేడ్ 2 పోస్టులకు అప్లై చేసుకోండి
DAO Jobs in Telangana 2022: డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ విభాగంలో 53 డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ (DAO) గ్రేడ్-2 పోస్టుల భర్తీ చేయనుంది. ఆగస్టు 17 నుంచి సెప్టెంబరు 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం www.tspsc.gov.in వెబ్‌సైట్ వెళ్లాలి.
డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు.. TSPSC అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లాలి. అక్కడ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు సెప్టెంబర్ 6, 2022 సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉంది. మొత్తం 53 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. .
అప్లై చేసుకునేవారికి కనీస వయోపరిమితి 18 సంవత్సరాలు, గరిష్ట వయోపరిమితి 44 సంవత్సరాలు. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. విద్యార్హతల విషయానికొస్తే, అభ్యర్థులు భారతదేశంలోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి లేదా ఏదైనా సమానమైన అర్హతలను కలిగి ఉండాలి. అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు అన్ని కేటగిరీ అభ్యర్థులకు రూ.200గా ఉంది. ఆబ్జెక్టివ్ తరహా రాత పరీక్ష ఉంటుంది. మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. పరీక్షను డిసెంబర్‌లో నిర్వహించనున్నారు.
ఎలా అప్లై చేయాలంటే..
అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.inని సందర్శించండి
వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న DAO అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయండి
మీ లాగిన్ ID మరియు పుట్టిన తేదీని నమోదు చేయండి (రిజిస్టర్ చేయకుంటే పోర్టల్‌లో నమోదు చేసుకోండి)
దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి. పత్రాలను అప్‌లోడ్ చేసి.. రుసుము చెల్లించండి. చివరకు సబ్మిట్ కొట్టాలి.
టాపిక్