TSPSC Notification : టీఎస్​పీఎస్సీ మరో నోటిఫికేషన్.. అటవీ కళాశాలలో ఉద్యోగాలు-tspsc notification released for professor jobs vacancies in forest college and research institute mulugu ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tspsc Notification : టీఎస్​పీఎస్సీ మరో నోటిఫికేషన్.. అటవీ కళాశాలలో ఉద్యోగాలు

TSPSC Notification : టీఎస్​పీఎస్సీ మరో నోటిఫికేషన్.. అటవీ కళాశాలలో ఉద్యోగాలు

HT Telugu Desk HT Telugu
Aug 22, 2022 10:09 PM IST

TSPSC Notification Released : ఇప్పటికే పలు ఉద్యోగాల భర్తీకి టీఎస్​పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో నోటిఫికేషన్ ఇచ్చింది.

టీఎస్​పీఎస్సీ నోటిఫికేషన్
టీఎస్​పీఎస్సీ నోటిఫికేషన్

టీఎస్​పీఎస్సీ మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ములుగు జిల్లాలోని అటవీ కళాశాలల్లో ఆచార్యుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అటవీ కళాశాలల్లో 27 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. సెప్టెంబరు 6 నుంచి 27 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టీఎస్​పీఎఎస్సీ నోటిఫికేషన్​లో పేర్కొంది.

ప్రొఫెసర్-02, అసోసియేట్ ప్రొఫెసర్-04, అసిస్టెంట్ ప్రొఫెసర్-21 పోస్టులను ఈ నోటిఫికేషన్లో భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో ఎంఎస్సీ మరియు పీహెచ్డీ (Ph.D) చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవాలి. ఎంపికైన వారికి నెలకు రూ.57,700 నుంచి రూ.1,44,200 వరకు వేతనం ఇస్తారు. విద్యార్హతలు, వేతనాలకు సంబంధించిన పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడండి. దరఖాస్తుదారుల వయస్సు 21 నుంచి 61 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం www.tspsc.gov.in వెబ్‌సైట్‌ వెళ్లాలి.

డీఏఓ గ్రేడ్ 2 పోస్టులకు అప్లై చేసుకోండి

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) ఇటీవలే మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ జారీ చేసింది. డైరెక్టర్‌ ఆఫ్‌ వర్క్స్‌ అకౌంట్స్‌ విభాగంలో 53 డివిజినల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ (DAO) గ్రేడ్‌-2 పోస్టుల భర్తీ చేయనుంది. ఆగ‌స్టు 17 నుంచి సెప్టెంబరు 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం www.tspsc.gov.in వెబ్‌సైట్‌ వెళ్లాలి.

డివిజినల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు.. TSPSC అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లాలి. అక్కడ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు సెప్టెంబర్ 6, 2022 సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉంది. మొత్తం 53 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. .

అప్లై చేసుకునేవారికి కనీస వయోపరిమితి 18 సంవత్సరాలు, గరిష్ట వయోపరిమితి 44 సంవత్సరాలు. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. విద్యార్హతల విషయానికొస్తే, అభ్యర్థులు భారతదేశంలోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి లేదా ఏదైనా సమానమైన అర్హతలను కలిగి ఉండాలి. అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు అన్ని కేటగిరీ అభ్యర్థులకు రూ.200గా ఉంది. ఆబ్జెక్టివ్ తరహా రాత పరీక్ష ఉంటుంది. మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. పరీక్షను డిసెంబర్‌లో నిర్వహించనున్నారు.

ఎలా అప్లై చేయాలంటే..

అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.inని సందర్శించండి

వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న DAO అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయండి

మీ లాగిన్ ID మరియు పుట్టిన తేదీని నమోదు చేయండి (రిజిస్టర్ చేయకుంటే పోర్టల్‌లో నమోదు చేసుకోండి)

దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి. పత్రాలను అప్‌లోడ్ చేసి.. రుసుము చెల్లించండి. చివరకు సబ్మిట్ కొట్టాలి.

IPL_Entry_Point