IIT Hyderabad: పలు ఉద్యోగాల భర్తీకి ఐఐటీ హైదరాబాద్ నోటిఫికేషన్ - వివరాలివే-iiit hyderabad issued notification for recruitment of various jobs
Telugu News  /  Telangana  /  Iiit Hyderabad Issued Notification For Recruitment Of Various Jobs
హైదరాబాద్ ఐఐటీలో ఉద్యోగాలు
హైదరాబాద్ ఐఐటీలో ఉద్యోగాలు

IIT Hyderabad: పలు ఉద్యోగాల భర్తీకి ఐఐటీ హైదరాబాద్ నోటిఫికేషన్ - వివరాలివే

20 August 2022, 19:15 ISTMahendra Maheshwaram
20 August 2022, 19:15 IST

iiit hyderabad latest jobs: పలు ఉద్యోగాల భర్తీకి హైదరాబాద్ ఐఐటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను పేర్కొంది.

Jobs in IIT Hyderabad 2022:హైదరాబాద్ ఐఐటీలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 31 పోస్టులను భర్తీ చేస్తుండగా... ఇందులో లైబ్రరీ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ ఇంజనీర్, ఇన్‌స్ట్రక్టర్, టెక్నీషియన్, మల్టీ స్కిల్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించి.. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను నియమించనున్నారు.

ముఖ్య వివరాలు

మొత్తం పోస్టులు - 31

దరఖాస్తు విధానం - ఆన్ లైన్

అర్హతలు - సంబంధిత పోస్టులో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత సాధించాలి.

దరఖాస్తులు ప్రారంభం - ఆగస్టు 19, 2022

చివరి తేదీ - 19 సెప్టెంబర్, 2022

అధికారిక వెబ్ సైట్ - https://staff.recruitment.iith.ac.in/

వయో పరిమితి - కనీసం 40 సంవత్సరాలు ఉండాలి.

సడలింపు: SC/ ST/OBC/PWD/ PH అభ్యర్థులకు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఉంటుంది.

ఫీజు వివరాలు - అభ్యర్థులందరూ రూ. 100 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఇలా అప్లయ్ చేసుకోండి...

ముందుగా అభ్యర్థులు అధికారికి వెబ్ సైట్(https://staff.recruitment.iith.ac.in/ ) ను సందర్శించాలి.

కెరీర్ అనే ఆప్షన్ కు వెళ్లాలి. ఇక్కడ IIT Hyderabad Staff Recruitment అనే దానిపై క్లిక్ చేయాలి.

తగిన వివరాలు నమోదు చేసి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయవచ్చు.

టాపిక్