JEE Advanced 2022: B.Tech అడ్మిషన్‌ల కోసం టాప్ ఐఐటీలు.. ఓ లుక్కేయండి !
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఆగస్టు 28న జరగనుంది. పరీక్షల అనంతరం ర్యాంకుల ప్రకటన ఉంటుంది. ఈ నేపథ్యంలో మంచి ర్యాంక్ సాదించినవారు ఎంచుకోవాల్సిన టాప్ ITTలపై ఓ లుక్కేయండి
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2022 ఆగస్టు 28న జరుగున్న విషయం అందరికి తెలిసింది. ప్రస్తుతం ప్రిపరేషన్ చివరి దశలో ఉన్న అభ్యర్థులు గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కోర్సుల్లో అడ్మిషన్ కోసం టాప్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లతో సీటు సంపాదించాలనే లక్ష్యంతో ఉన్నారు. JEE అడ్వాన్స్‌డ్‌ను క్లియర్ చేసిన విద్యార్థులు IITలలో UG కోర్సులలో ఇంజనీరింగ్, సైన్స్ లేదా ఆర్కిటెక్చర్‌లో గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సులు, ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ ప్రోగ్రామ్‌లు లేదా గ్రాడ్యుయేట్-మాస్టర్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్‌లలో వారు పేరును నమోదు చేసుకోవచ్చు.
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష పేపర్ 1 ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్ 2 ఆగస్టు 28న మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు నిర్వహించనున్నారు. ఇంజినీరింగ్ అభ్యర్థులు JEE అడ్వాన్స్‌డ్ సంబంధించిన మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలను ఇప్పుడు కావాలంటే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. JEE అడ్వాన్స్‌డ్ 2022 ద్వారా UG ఇంజనీరింగ్ ప్రోగ్రామ్‌లో అడ్మిషన్ కోరుకునే విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ - jeeadv.ac.in నుండి NIRF ర్యాంకింగ్ 2022 ప్రకారం టాప్ IITలు, ఇతర ఇంజనీరింగ్ కాలేజీల గురించి తెలుసుకోండి.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్
- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ
- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే
- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్
- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్‌పూర్
- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ
- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుచిరాపల్లి
- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కర్ణాటక, సూరత్కల్
- జాదవ్‌పూర్ యూనివర్సిటీ
వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బనారస్ హిందూ యూనివర్సిటీ) వారణాసి
- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్)
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రూర్కెలా
సంబంధిత కథనం