SSC స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ విడుదల.. ఇలా దరఖాస్తు చేసుకోండి!-ssc stenographer 2022 notification released on ssc nic in how to apply eligibility and other details ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ssc స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ విడుదల.. ఇలా దరఖాస్తు చేసుకోండి!

SSC స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ విడుదల.. ఇలా దరఖాస్తు చేసుకోండి!

HT Telugu Desk HT Telugu
Aug 21, 2022 03:11 PM IST

SSC.. స్టెనోగ్రాఫర్ C&D ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 20, 2022 నుండి ప్రారంభంకానుంది. దరఖాస్తు గడువు సెప్టెంబర్ 05న ముగుస్తుంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ssc.nic.inని సందర్శించి, దరఖాస్తు చేసుకోవచ్చు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్( SSC) స్టెనోగ్రాఫర్ C & D పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 20, 2022 నుండి ప్రారంభమైంది. సెప్టెంబర్ 05న దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ssc.nic.inలోని నోటిఫికేషన్‌ను చూడవచ్చు.

SSC Stenographer 2022: ఇవి ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ: 20 ఆగస్టు 2022

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 05 సెప్టెంబర్ 2022

దరఖాస్తు కరక్షన్ విండో ప్రారంభ తేదీ 07 సెప్టెంబర్ 2022

SSC స్టెనోగ్రాఫర్ పరీక్ష 2022:

ఎలా దరఖాస్తు చేసుకోవాలి

Step 1: అధికారిక వెబ్‌సైట్ ssc.nic.inని సందర్శించండి.

Step 2: హోమ్‌పేజీలో, 'SSC స్టెనోగ్రాఫర్ C&D పరీక్ష 2022' నోటీసుపై క్లిక్ చేయండి.

Step 3: స్క్రీన్‌పై కొత్త పేజీ కనిపిస్తుంది, ఇక్కడ నోటిఫికేషన్‌ను చెక్ చేయండి.

Step 4: ఇప్పుడు రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేసి, మీ వివరాలను నమోదు చేయడం ద్వారా నమోదు చేసుకోండి.

Step 5: మీరు నింపిన దరఖాస్తు ఫారమ్ కాపీని మీ వద్ద సేవ్ చేసుకోండి.

దరఖాస్తు చేయడానికి అభ్యర్థుల కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి. గరిష్ట వయోపరిమితి గ్రూప్ సికి 30 సంవత్సరాలు, గ్రూప్ డికి 27 సంవత్సరాలు. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు కూడా ఉంది. ఎన్ని ఖాళీలు ఉన్నాయో నోటిఫికేషన్‌లో ఇవ్వలేదు. అభ్యర్థులు నోటిఫికేషన్‌ని చూసి, ఇచ్చిన డైరెక్ట్ లింక్ నుండి దరఖాస్తు చేసుకోండి.

అధికారిక నోటిఫికేషన్‌ను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Whats_app_banner

సంబంధిత కథనం