T-SAT : గ్రూప్ - 1 అభ్యర్థులకు అలర్ట్... ఫ్రీ కోచింగ్ టైం మరింత పెంపు
TSAT group 1 classes: గ్రూప్ -1 ఉద్యోగ అభ్యర్థులకు టీ- శాట్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. టీ-సాట్ ప్రసారం చేస్తున్న పాఠ్యాంశాలను మరో గంట అదనంగా ప్లే చేయనున్నారు. ఈ మేరకు ప్రకటన విడుదలైంది.
TSAT group 1 free coaching: గ్రూపు -1 నోటిఫికేషన్ రావటంతో పాటు అభ్యర్థుల నుంచి భారీ స్థాయిలో దరఖాస్తులు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సిరీయస్ గా ప్రిపేర్ అయ్యే వారు.. ఏ ఒక్క అవకాశాన్ని వదిలే పరిస్థితి కనిపించటం లేదు. అకాడమీ పుస్తకాలు, సొంతగా మెటిరియల్ తయారు చేసుకోవటంతో పాటు నిపుణుల సూచనలు పరిగణలోకి తీసుకుంటూ ముందుకెళ్లే పనిలో ఉన్నారు. ఇక వీరి కోసం టీ-శాట్.... ఇప్పటికే వీడియో పాఠాలను ప్రసారం చేస్తోంది. అయితే ఈ సమయాన్ని మరో గంటపాటు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు టి-సాట్ సీఈవో రాంపురం శైలేష్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
మరో గంటపాటు పెంపు…
తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమంలో ప్రతి రోజూ నాలుగు గంటలు- ఎనిమిది పాఠ్యాంశాలుగా ప్రసారం చేయనున్నట్లు వెల్లడించారు. టీ-శాట్ నిపుణ ఛానల్ లో సాయంత్రం ఆరు గంటల నుంచి 10 గంటల వరకు, విద్య ఛానల్ లో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ప్రసారాలుంటాయని ప్రకటించారు. గతంలో మూడు గంటలుగా ఉన్న ప్రసారాలను మరో గంట అదనంగా ప్రసారం చేస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నాలుగు గంటల్లో గంట పాటు ఇంగ్లీష్ పాఠ్యాంశాలుంటాయని స్పష్టం చేశారు. మే ఒకటవ తేదీ నుంచి ఈ పాఠ్యాంశాలు ప్రసారం చేస్తున్నట్లు పేర్కొన్నారు. అక్టోబర్ 16వ తేదీన ప్రిలిమ్స్ పరీక్ష తేదీని ఖరారు చేసినందున అదనపు పాఠ్యంశాలను ప్రసారం చేసి, పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకు మరింత వెసులుబాటు కలిగించాలని నిర్ణయించినట్లు శైలేష్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇప్పటికే సుమారు 180 పాఠ్యాంశ భాగాలు ప్రసారాలు చేసినట్లు... అక్టోబర్ 10వ తేదీ వరకు 620 పాఠ్యాంశ భాగాలను ప్రసారాలు చేయాలని నిర్ణయించామని శైలేషన్ రెడ్డి చెప్పారు. ఆంగ్ల భాష ప్రసారాలతో కలిపి మొత్తం 1200 పాఠ్యాంశ భాగాలు ప్రసారం చేస్తామని వెల్లడించారు. ఈ అవకాశాన్ని అభ్యర్థులను ఉపయోగించుకోవాలని కోరారు.
దాదాపు 50 వేల ప్రశ్నలతో క్వశ్చన్ బ్యాంక్ రూపొందిస్తోంది టీ- శాట్. ఇది గ్రూప్–1, గ్రూప్–2, గ్రూప్–3, గ్రూప్–4 పరీక్షలు రాసే అభ్యర్థులకు ఎంతగానో ఉపయోగపడనుంది. ఆన్ లైన్ లో నమూనా పరీక్ష (మాక్ టెస్ట్)లకు సైతం హాజరయ్యే వీలును కల్పిస్తోంది. టీశాట్ తలపెట్టి ఈ క్వశ్చన్ బ్యాంక్.. మరికొద్దిరోజుల్లోనే అందుబాటులోకి రానుంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్దేశించిన సిలబస్ ఆధారంగానే ప్రశ్నలు రూపొందిస్తున్నారు.
టాపిక్