TS ECET 2024 : తెలంగాణ ఈసెట్ దరఖాస్తులు ప్రారంభం - డైరెక్ట్ లింక్ ఇదే
15 February 2024, 15:56 IST
- TS ECET 2024 Registrations: తెలంగాణ ఈసెట్ -2024 దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. https://ecet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
తెలంగాణ ఈసెట్ - 2024
TS ECET 2024 Updates : తెలంగాణ ఈసెట్ ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. బీటెక్ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ప్రవేశాల కోసం నిర్వహించే 'టీఎస్ ఈసెట్' నోటిఫికేషన్ ఫిబ్రవరి 14వ తేదీన విడుదల కాగా… ఇవాళ్టి నుంచి దరఖాస్తులను స్వీకణ మొదలైంది. మే 6వ తేదీన ఈసెట్ ఎగ్జామ్ జరగనుంది. https://ecet.tsche.ac.in/ వెబ్ సైట్ లో వివరాలను చెక్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 16వ తేదీతో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగుస్తుంది. మే 1వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
TS ECET 2024 registration: ఇలా దరఖాస్తు చేసుకోవచ్చు
అర్హులైన అభ్యర్థులు మొదటగా… ఈసెట్ అధికారిక వెబ్ సైట్ https://ecet.tsche.ac.in/ లోకి వెళ్లాలి.
టీఎస్ ఈసెట్ 2024 registration లింక్ పై క్లిక్ చేయాలి. అంతకంటే ముందు పేమెంట్ ప్రక్రియను పూర్తి చేయాలి.
Payment Reference ID, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
నాలుగు దశల్లో మొత్తం ప్రక్రియ పూర్తి అవుతుంది.
సబ్మిట్ బటన్ నొక్కిన తర్వాత… అప్లికేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది. డౌన్లోడ్ లేదా ప్రింట్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.
టీఎస్ ఈసెట్ షెడ్యూల్ - ముఖ్య తేదీలు
తెలంగాణ ఈసెట్ -2024 నోటిఫికేషన్ - ఫిబ్రవరి 14, 2024.
దరఖాస్తుల స్వీకరణ - ఫిబ్రవరి 15, 2024.
దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు - ఏప్రిల్ 16, 2024.
ఆలస్యం రుసుంతో - ఏప్రిల్ 28, 2024.
దరఖాస్తుల్లో సవరణలకు అవకాశం - ఏప్రిల్ 24 నుంచి 28, 2024.
ఈసెట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ - మే 6, 2024.
TS Lawcet Schedule 2024: లాసెట్ - 2024 షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 28 లా సెట్, పీజీ లా సెట్(ts lawcet 2024 exam date) నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి పేర్కొంది. మార్చి ఒకటవ తేదీ నుంచి ఏప్రిల్ 15 వరకు దరఖాస్తుల స్వీకరించనున్నట్లు ప్రకటించింది. జూన్ 3న ప్రవేశ పరీక్ష జరగనుంది.
తెలంగాణ లాసెట్ - 2024 నోటిఫికేషన్ - ఫిబ్రవరి 28, 2024.
దరఖాస్తుల స్వీకరణ - మార్చి 1, 2024.
దరఖాస్తులకు తుది గడువు - ఏప్రిల్ 15, 2024.
ఆలస్య రుసుంతో - 25.మే.2024
లాసెట్ ప్రవేశ పరీక్ష - జూన్ 3, 2024.