Telangana EdCET 2024 : బీఈడీ ప్రవేశాలు - తెలంగాణ ఎడ్సెట్ షెడ్యూల్ విడుదల, మేలో ఎగ్జామ్-ts edcet schedule 2024 released check the key dates are here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Edcet 2024 : బీఈడీ ప్రవేశాలు - తెలంగాణ ఎడ్సెట్ షెడ్యూల్ విడుదల, మేలో ఎగ్జామ్

Telangana EdCET 2024 : బీఈడీ ప్రవేశాలు - తెలంగాణ ఎడ్సెట్ షెడ్యూల్ విడుదల, మేలో ఎగ్జామ్

Maheshwaram Mahendra Chary HT Telugu
Feb 14, 2024 11:45 AM IST

TS EdCET 2024 Updates: బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ ఎడ్ సెట్ 2024 షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యామండలి… ముఖ్య తేదీలను పేర్కొంది. ఆ వివరాలను ఇక్కడ చూడండి…

తెలంగాణ ఎడ్ సెట్ 2024
తెలంగాణ ఎడ్ సెట్ 2024

TS EdCET Schedule 2024 Updates: ఈ ఏడాదికి సంబంధించిన ప్రవేశాల పరీక్షలకు సంబంధించి ఇప్పటికే తేదీలను ప్రకటించింది తెలంగాణ ఉన్నత విద్యామండలి. ఇందులో భాగంగా తెలంగాణ ఎడ్ సెట్ -2024 షెడ్యూల్ ను వెల్లడించింది. ఈ మేరకు వివరాలను పేర్కొంది. ఈ ఎంట్రెన్స్ పరీక్ష ద్వారా… బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. మార్చి 4వ తేదీన ఎడ్ సెట్ నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు ఉన్నత విద్యామండలి తెలిపింది. మే 23వ తేదీన పరీక్ష నిర్వహించనున్నారు. https://edcet.tsche.ac.in/ వెబ్ సైట్ లో పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

తెలంగాణ ఎడ్ సెట్ షెడ్యూల్ :

తెలంగాణ ఎడ్ సెట్ నోటిఫికేషన్ - మార్చి 04,2024.

ఎడ్ సెట్ దరఖాస్తుల స్వీకరణ - మార్చి 6,2024.

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ - మే 06,2024.

ఎడ్ సెట్ ప్రవేశ పరీక్ష - మే 23, 2024.

అధికారిక వెబ్ సైట్ - https://edcet.tsche.ac.in/

ఈసెట్ షెడ్యూల్

బీటెక్‌ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ప్రవేశాల కోసం నిర్వహించే 'టీఎస్‌ ఈసెట్‌' నోటిఫికేషన్ ఫిబ్రవరి 14వ తేదీన విడుదల కానున్నట్లు వెల్లడించింది తెలంగాణ ఉన్నత విద్యా మండలి. మే 6వ తేదీన ఈసెట్ ఎగ్జామ్ జరగనుంది. https://ecet.tsche.ac.in/ వెబ్ సైట్ లో వివరాలను చెక్ చేసుకోవచ్చు.

టీఎస్ ఈసెట్ షెడ్యూల్ - ముఖ్య తేదీలు

తెలంగాణ ఈసెట్ -2024 నోటిఫికేషన్‌ - ఫిబ్రవరి 14, 2024.

దరఖాస్తుల స్వీకరణ - ఫిబ్రవరి 15, 2024.

దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు - ఏప్రిల్ 16, 2024.

ఆల‌స్యం రుసుంతో - ఏప్రిల్ 28, 2024.

దరఖాస్తుల్లో సవరణలకు అవకాశం - ఏప్రిల్ 24 నుంచి 28, 2024.

ఈసెట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ - మే 6, 2024.

టీఎస్ లాసెట్ షెడ్యూల్ 2024

TS Lawcet Schedule 2024: లాసెట్ - 2024 షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 28 లా సెట్‌, పీజీ లా సెట్(ts lawcet 2024 exam date) నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి పేర్కొంది. మార్చి ఒకటవ తేదీ నుంచి ఏప్రిల్ 15 వరకు దరఖాస్తుల స్వీకరించనున్నట్లు ప్రకటించింది. జూన్‌ 3న ప్రవేశ పరీక్ష జరగనుంది.

తెలంగాణ లాసెట్ - 2024 నోటిఫికేషన్ - ఫిబ్రవరి 28, 2024.

దరఖాస్తుల స్వీకరణ - మార్చి 1, 2024.

దరఖాస్తులకు తుది గడువు - ఏప్రిల్ 15, 2024.

ఆలస్య రుసుంతో - 25.మే.2024

లాసెట్ ప్రవేశ పరీక్ష - జూన్ 3, 2024.

ఈ ఏడాది ఈసెట్ ప్రవేశ పరీక్షను ఉస్మానియా వర్శిటీ, ఎంసెట్ పరీక్షలను జేఎన్టీయూ నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి పేర్కొంది. ఎడ్ సెట్ ఎగ్జామ్ ను మహాత్మ గాంధీ వర్శిటీ, లాసెట్ - ఉస్మానియా వర్శిటీ, ఐసెట్ - కాకతీయ వర్శిటీ, పీజీఈసెట్ - జేఎన్టీయూ, టీఎస్ పీఈసెట్ ప్రవేశ పరీక్షను శాతవాహన వర్శిటీ నిర్వహించనుంది.

IPL_Entry_Point