TS DOST Registration 2024 : డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు, ప్రారంభమైన 'దోస్త్' రిజిస్ట్రేషన్లు - ఇలా ప్రాసెస్ చేసుకోండి
09 May 2024, 14:19 IST
- Telangana Degree Admissions 2024 Updates: దోస్త్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రిజిస్ట్రేషన్ల ఆధారంగానే రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లోని సీట్లను కేటాయిస్తారు. ప్రస్తుతం ఫస్ట్ ఫేజ్ ప్రవేశాల ప్రక్రియ నడుస్తోంది.
దోస్త్ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం
దోస్త్ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం
దోస్త్ రిజిస్ట్రేషన్ల ద్వారా తెలంగాణలోని ఓయూ, కాకతీయ యూనివర్శిటీ, పాలమూరు, మహాత్మగాంధీ, తెలంగాణ వర్శిటీ, శాతవాహన వర్శిటీల పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలను కల్పిస్తారు.
TS DOST Registration 2024 - దోస్త్ రిజిస్ట్రేషన్ ఇలా చేసుకోండి
- డిగ్రీ ప్రవేశాల పొందే అర్హత ఉన్న విద్యార్థులు దోస్త్ అధికారిక వెబ్ సైట్ https://dost.cgg.gov.in/ లోకి వెళ్లాలి.
- ముదుగా Candidate Pre-Registrationపై క్లిక్ చేయాలి.
- ఇక్కడ మీ ఇంటర్ హాల్ టికెట్ నెంబర్, పుట్టినతేదీ, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి. ఫలితంగా aadhaar authentication ప్రక్రియ పూర్తి అవుతుంది.
- ఫలితంగా మీ లాగిన్ పూర్తి అవుతుంది.
- నిర్ణయించిన ఫీజును తప్పకుండా చెల్లించాలి.
- ఫైనల్ గా మీ రిజిస్ట్రేషన్ దోస్త్ లో పూర్తి అవుతుంది.
- తొలి విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మే 25వ తేదీవ తేదీతో పూర్తి కానుంది.
- తొలి విడత సీట్లను జూన్ 3వ తేదీన కేటాయిస్తారు.
- జూన్ 10వ తేదీలోపు ఆయా కాలేజీల్లో విద్యార్థులు రిపోర్ట్ చేయాలి.
దోస్త్(TS DOST) రిజిస్ట్రేషన్ల ముఖ్య తేదీలివే..
- ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మే 6వ తేదీ నుంచే ప్రారంభమైంది.
- మే 25వ తేదీ లోపు ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి.
- ఆ తర్వాత వెబ్ ఆప్షన్లు ఎంచుకోవాలి. జూన్ 4 నుంచి 14 వరకు ఈ అవకాశం ఉంటుంది.
- తొలి విడత సీట్లను జూన్ 3వ తేదీన కేటాయిస్తారు.
- సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 10వ తేదీలోపు ఆయా కాలేజీల్లో విద్యార్థులు రిపోర్ట్ చేయాలి.
- రెండో విడత రిజిస్ట్రేషన్లు జూన్ 4వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయి. 13వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ కు అవకాశం ఉంటుంది.
- రెండో విడత సీట్లను జూన్ 18వ తేదీన కేటాయిస్తారు.
- జూన్ 19 నుంచి 24వ తేదీలోపు సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
- చివరి విడత జూన్ 19వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. జూన్ 25 వరకు విద్యార్థులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి.
- జూన్ 19 నుంచి 26 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి.
- జూన్ 29వ తేదీన తుది విడుత సీట్లను కేటాయిస్తారు.
- జూలై 3వ తేదీలోపు విద్యార్థులు కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
- జూలై 7వ తేదీ నుంచి డిగ్రీ తరగతులు తరగతులు ప్రారంభమవుతాయి.
మొత్తం 3 విడతల్లో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేయనుంది తెలంగాణ ఉన్నత విద్యా మండలి. గత ఏడాది కూడా ఇదే మాదిరిగా డిగ్రీ ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేసింది. https://dost.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి ఇతర అప్డేట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు.