తెలుగు న్యూస్ / ఫోటో /
AP TS Weather Updates : నిప్పుల కొలిమిగా ఏపీ, తెలంగాణ - రికార్డు స్థాయిలో నంద్యాలలో 47.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
- AP TS Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. శుక్రవారం(మే 3) నంద్యాల జిల్లాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గోస్పాడు, బండి ఆత్మకూరు లో 47.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
- AP TS Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. శుక్రవారం(మే 3) నంద్యాల జిల్లాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గోస్పాడు, బండి ఆత్మకూరు లో 47.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
(1 / 5)
ఏపీలో సూర్యుడి ప్రతాపం రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా వడగాలులు కొనసాగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు.(Photo Source @APSDMA Twitter)
(2 / 5)
శుక్రవారం (మే3) ఏపీలోని నంద్యాల జిల్లాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గోస్పాడు, బండి ఆత్మకూరు లో 47.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. (Photo Source @APSDMA Twitter)
(3 / 5)
ప్రకాశం జిల్లాలోని అర్ధవీడులో 47.3°C, వైయస్సార్ జిల్లాలోని చిన్నచెప్పలిలో 47.2°C,నెల్లూరు జిల్లాలోని వేపినాపి అక్కమాంబపురంలో 47.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.(photo source from https://unsplash.com/)
(4 / 5)
రేపు(మే 4) 58 మండలాల్లో తీవ్రవడగాల్పులు,169 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఎల్లుండి 78మండలాల్లో తీవ్రవడగాల్పులు,273 వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. (photo source from https://unsplash.com/)
(5 / 5)
తెలంగాణలోనూ ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. మే 3వ తేదీన పెద్దపల్లి జిల్లాలోని మంథనిలో 46.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక జగిత్యాల జిల్లాలోని నేరెళ్లలో 46.7, సూర్యాపేట జిల్లాలోని మునగాలలో 46.7, ఖమ్మం జిల్లాలోని పమ్మిలో 46.7, నల్లగొండ జిల్లా కామారెడ్డిగూడెంలో 46.6,డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.(photo source from https://unsplash.com/)
ఇతర గ్యాలరీలు