Telangana Govt : 'ఆధార్' తప్పనిసరి - 'ఉచిత విద్యుత్ స్కీమ్' పై కీలక ఉత్తర్వులు జారీ
16 February 2024, 20:26 IST
- TS Govt Gruha Jyothi Scheme Updates: ఉచిత విద్యుత్ స్కీమ్ కు సంబంధించి కీలక ఉత్తర్వులను ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఆధార్ లింక్ తప్పనిసరి అని స్పష్టం చేసింది.
తెలంగాణలో ఉచిత విద్యుత్
TS Govt Gruha Jyothi Scheme Guidelines : ఉచిత్ విద్యుత్ స్కీమ్ అమలుకు సంబంధించి తెలంగాణ సర్కార్ కీలక అప్డేట్ ఇచ్చింది. ఆధార్ కార్డును తప్పనిసరిగా లింక్ చేసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది. బయోమెట్రిక్ లో ఏమైనా ఇబ్బందులు ఉంటే… ఐరిస్ ద్వారా లింక్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఈ విధంగా కూడా లింక్ అవ్వకపోతే…. ఓటీపీ ఆధారంగా లింక్ చేసుకోవాలని సూచించింది.
ఈ పత్రాలను చూపించవచ్చు…
ఆధార్ కార్డు లేనివారు చూపించాల్సిన పత్రాల వివరాలను కూడా ప్రభుత్వం పేర్కొంది. అయితే ఇలాంటి వారు ఈ స్కీమ్ కు దరఖాస్తు చేసుకోవాలంటే… ఆధార్ కార్డుకు ముందుగా ఆప్లయ్ చేసుకోవాలి. అక్కడ ఇచ్చే రశీదును తీసుకోవాలి. ఈ రశీదుతో పాటు కొన్ని పత్రాల పేర్లను ప్రభుత్వం సూచించింది. ఇందులో ఏదైనా ఒకటి సమర్పించాలని పేర్కొంది.
- ఫొటోతో కూడిన బ్యాంక్ పాస్ బుక్, పోస్టాఫీస్ పాస్ట్ బుక్.
-పాన్ కార్డు
-పాస్ పోర్టు
-రేషన్ కార్డు
-ఓటరు కార్డు
-ఉపాధి హామీ కార్డు
-కిసాన్ ఫొటో పాస్ బుక్
-డ్రైవింగ్ లైసెన్స్
- తహసీల్దార్ ఇచ్చే ధ్రువకరణపత్రం
ఈ స్కీమ్ కింద ఇళ్లల్లో వాడే 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ.. ఎన్నికల హామీలో ప్రకటించింది. ఆరు గ్యారెంటీలలో ఇది ఒకటిగా కూడా ఉంది. ఈ స్కీమ్ అమలుకు కేబినెట్ కూడా ఆమోదముద్ర వేసింది. ఉచిత విద్యుత్ స్కీమ్ ను అమలు చేసేందుకు అడుగులు పడుతున్నాయి. క్షేత్రస్థాయిలో అర్హులను గుర్తించేందుకు వివరాలను సేకరిస్తున్నారు అధికారులు.విద్యుత్ శాఖ సిబ్బంది లైన్‌మెన్లు, బిల్లింగ్ సిబ్బంది ఇంటింటికీ వెళుతున్నారు. మీటర్ ఎవరి పేరుతో ఉంది….. నెలనెలా ఎన్ని యూనిట్లు వాడుతున్నారు వంటి వివరాలను సేకరిస్తున్నారు. ఆధార్ కార్డు, పాత రేషన్ కార్డుల వివరాలను ఐఆర్ మెషిన్‌లో అప్ లోడ్ చేస్తున్నారు.
కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం…. భారీగా బదిలీలను చేస్తోంది. ఇప్పటికే ఐఎఎస్, ఐపీఎస్, డీఎస్పీలతో పాటు పలు శాఖల్లో పని చేస్తున్న అధికారులను బదిలీ చేస్తోంది. తాజాగా 25 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది. వనపర్తి అదనపు కలెక్టర్‌గా ఎం.నగేష్, వరంగల్ అదనపు కలెక్టర్‌గా గట్టు సంధ్యారాణి, నల్గొండ డీఆర్‌వోగా డి.రాజ్యలక్ష్మి, సంగారెడ్డి డీఆర్‌వోగా డి.పద్మజా రాణి నియమితులయ్యారు. కీసర ఆర్డీవోగా కె.వెంకట ఉపేందర్‌రెడ్డి, రాజేంద్రనగర్ ఆర్డీవోగా కొప్పుల వెంకట్‌రెడ్డి, జహీరాబాద్ ఆర్డీవోగా ఎస్.రాజు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.