తెలంగాణ(Telangana)లోని ఉన్నత విద్యా సంస్థల్లో బయో మెట్రిక్ హాజరు అమలు చేయాలని ప్రభుత్వం(Govt) నిర్ణయించింది. కాలేజీలు, యూనివర్సిటీల వరకు అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో బయోమెట్రిక్(Biometric) హాజరును తప్పని సరిచేశారు. బోధన, బోధనేతర సిబ్బందికి, విద్యార్థులకు కూడా బయో మెట్రిక్ హాజరును ఉపయోగించాలి.
ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ తాజాగా ఉత్తర్వులు ఇచ్చారు. దీనికి సంబంధించిన చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. స్కాలర్‌షిప్(Scholarship), ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేసేందుకు హాజరు శాతం తెలుసుకునేందుకు బయోమెట్రిక్ హాజరు(Biometric Attendance) ఉపయోగపడుతుంది. టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది ఆయా విద్యా సంస్థల్లో ఎంత సమయం పనిచేస్తున్నారనేది కూడా ఇకపై రికార్డ్ కానుంది. సెలవులు, ఇతరత్రా విషయాలకు కూడా బయోమెట్రిక్ ఉపయోగపడుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.