తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Srisailam Tour Package : రూ.2 వేలకే 'శ్రీశైలం' ట్రిప్ - అద్భుతమైన 'రోప్‌ వే' జర్నీ చేయవచ్చు, తాజా టూర్ ప్యాకేజీ ఇదే..!

Srisailam Tour Package : రూ.2 వేలకే 'శ్రీశైలం' ట్రిప్ - అద్భుతమైన 'రోప్‌ వే' జర్నీ చేయవచ్చు, తాజా టూర్ ప్యాకేజీ ఇదే..!

27 June 2024, 13:18 IST

google News
    • Telangana Tourism Srisailam Package : శ్రీశైలం చూసేందుకు తెలంగాణ టూరిజం ప్యాకేజీని తీసుకొచ్చింది. రెండు రోజులు టూర్ సాగుతుంది. హైదరాబాద్ నుంచి బస్సు జర్నీ ద్వారా ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. పూర్తి వివరాలను ఇక్కడ చూడండి…..
శ్రీశైలం టూర్ ప్యాకేజీ
శ్రీశైలం టూర్ ప్యాకేజీ

శ్రీశైలం టూర్ ప్యాకేజీ

Telangana Tourism Srisailam Package : పలు అధ్యాత్మిక ప్రాంతాలను చూసేందుకు తెలంగాణ టూరిజం పలు ప్యాకేజీలను ప్రకటిస్తోంది. ఇందులో భాగంగా శ్రీశైలంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను చూసేందుకు సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది.

ఈ ప్యాకేజీని హైదరాబాద్ నుంచి బస్సు జర్నీ ద్వారా ఆపరేట్ చేస్తుంది. ప్రతిరోజూ ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. ఈ ట్రిప్ లో భాగంగా…. శ్రీశైలం దర్శనం, పాతాళ‌గంగా, పాలధార(Paaladhara), పంచధార, శ్రీశైలం డ్యామ్  ప్రాంతాలను చూడొచ్చు.

శ్రీశైలం టూర్ ప్యాకేజీ వివరాలు:

  • హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళేందుకు తెలంగాణ టూరిజం ప్యాకేజీని ఆపేరట్ చేస్తుంది. 
  • DAILY SRISAILAM TOUR పేరుతో టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.
  • ప్రతిరోజు ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.  హైదరాబాద్ నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది.
  • ఏసీ, నాన్ ఏసీ బస్సు సౌకర్యం ఉంటుంది. ఎంచుకున్న దానిబట్టి టికెట్ ధరలు ఉంటాయి.
  • చూసే ప్రాంతాలు : శ్రీశైలం దర్శనం, పాతాళ‌గంగా, పాలధార(Paaladhara), పంచధార, శ్రీశైలం డ్యామ్, శిఖరం.
  • హైదరాబాద్ నుంచి టూర్ ప్రారంభం అవుతుండ‌గా.. ఇది 1 రాత్రి, 2 రోజులు కొనసాగుతుంది. ప్రతిరోజు హైదరాబాద్ పర్యాటక భవన్, బషీర్‌బాగ్‌ నుంచి బ‌స్సులు అందుబాటులో ఉంటాయి.
  • Day 1 - ఫస్ట్ డే హైదరాబాద్‌లోలోని పర్యాటక భవన్  నుంచి 8:30 గంటలకు బస్సు బయలుదేరుతుంది. భోజనం త‌ర్వాత మార్గమధ్యంలో సాక్షి గణపతి ఆలయాన్ని ద‌ర్శించుకుంటారు. సాయంత్రం 5:00 గంటలకు శ్రీశైలం చేరుకుని.. బస కోసం నేరుగా హోటల్‌కు వెళ‌తారు. శ్రీశైలంలోనే రాత్రి బ‌స ఉంటుంది.  (శ్రీశైలం హోటల్లో దుప్పట్లు అందించబడవు. పర్యాటకులు సొంతంగా దుప్పట్లు తీసుకెళ్లాల్సి ఉంటుంది.)
  • Day 2 -  2వ రోజు ఉదయం దర్శనం అనంత‌రం టిఫిన్ చేస్తారు.  హోటల్ నుండి చెక్ అవుట్ త‌ర్వాత రోప్ వేకు వెళ్తారు. ఈ జర్నీ అద్భుతంగా ఉంటుంది.  పాతాళగంగ, పాలధార, పంచధార, హైడ్రో‌ఎలక్ట్రిక్ ప్రాజెక్టు, శ్రీశైలం డ్యామ్ త‌దిత‌ర ప్రాంతాల‌ను చూస్తారు. రాత్రి 7 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటారు. దీంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
  • టికెట్ ధరలు :  ఏసీ బస్ ప్యాకేజీ అయితే పెద్దలకు రూ.2400, పిల్లలు (5 నుంచి 12సంవత్సరాలు) రూ.1920 చెల్లించాల్సి ఉంటుంది. 
  • నాన్ AC బస్ ప్యాకేజీలో పెద్దలకు రూ.2000, పిల్లలకు రూ.1600గా నిర్ణయించారు.
  • అధికారిక వెబ్ సైట్ - https://tourism.telangana.gov.in/ 
  • శ్రీశైలం టూర్ ప్యాకేజీ లింక్ - https://tourism.telangana.gov.in/package/srisailamtour 

యాదాద్రి టూర్ ప్యాకేజీ

యాదాద్రితో పాటు మరికొన్ని ఆలయాలను చూసేందుకు తెలంగాణ టూరిజం మరో కొత్త ప్యాకేజీని ప్రకటించింది.కేవలం ఒక్క రోజులోనే ఈ టూర్ ముగుస్తుంది. అతి తక్కువ ధరలోనే ప్రతి శనివారం తేదీల్లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. బస్సు జర్నీ ద్వారా ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. https://tourism.telangana.gov.in/  వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు.

హైదరాబాద్ - యాదగిరిగుట్ట టూర్ షెడ్యూల్…

  • తెలంగాణ టూరిజం YADAGIRIGUTTA PACKAGE TOUR ను ప్రకటించింది.
  • హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు.
  • ప్రతి శనివారం తేదీల్లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.
  • ఏసీ మినీ కోచ్ లో జర్నీ ఉంటుంది.
  • కేవలం ఒకే ఒక్క రోజులో ఈ ప్యాకేజీ ముగుస్తుంది.
  • ఉదయం 9 గంటలకు హైదరాబాద్ లోని బషీర్ బాగ్ నుంచి స్టార్ట్ అవుతారు.
  • 10:30 గంటలకు కొలనుపాకకు చేరుకుంటారు. పురాతన జైన్ ఆలయాన్ని దర్శించుకుంటారు.
  • 11:30 AM గంటలకు కొలనుపాక నుంచి బయల్దేరుతారు.
  • 12:30 PMకు యాదగిరిగుట్టలోని ఆలయాన్ని సందర్శిస్తారు.
  • 1:30 PM to 2:00 PM హరిత హోటల్ లో భోజనం చేస్తారు.
  • 4:30 PM సురేంద్రపురికి వెళ్తారు. ఇక్కడ ప్రముఖ ఆలయాల సెట్టింగ్ లను చూస్తారు,
  • 9:30 PM గంటలకు హైదరాబాద్ కు చేరుకుంటారు.
  • https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి బుకింగ్ తో పాటు పూర్తి వివరాలను తెలుకోవచ్చు.
  • ఈ ప్యాకేజీ ధరలు చూస్తే… పెద్దలకు రూ. 1499, పిల్లలకు రూ.1199గా నిర్ణయించారు.

తదుపరి వ్యాసం