(1 / 6)
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరో కొద్దిరోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది.
(2 / 6)
తూర్పు, మధ్య బంగాఖాతం పొరుగున ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం పశ్చిమ మధ్య దాని అనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా వెళ్తోందని ఐఎండీ తెలిపింది. సగటు సముద్ర మట్టం నుంచి 1. 5 నుంచి 5.8 కి.మీ ఎత్తుతో నైరుతి దిశగా వంగి ఉందని పేర్కొంది.
(3 / 6)
ఇవాళ, రేపు కోస్తాంధ్రలో అక్కడక్కడ మోస్తరు, భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. భారీ వర్షాల నేపధ్యంలో లొతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
(4 / 6)
ఇవాళ ఏపీలోని మన్యం,అల్లూరి,విశాఖ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి-మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం,విజయనగరం,అనకాపల్లి,కాకినాడ, కోనసీమ,ఉభయగోదావరి,ఏలూరు,కృష్ణా,ఎన్టీఆర్, గుంటూరు,బాపట్ల,పల్నాడు,ప్రకాశం,నెల్లూరు,కర్నూలు, నంద్యాల,అనంతపురం,సత్యసాయి,వైయస్ఆర్, అన్నమయ్య,చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
(5 / 6)
ఇవాళ హైదరాబాద్ లో చూస్తే... పగటిపూట తేలికపాటి లేదా మోస్తారు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. రాత్రికి ఒకటి లేదా రెండు చోట్ల ఈదురుగాలులతో పాటు తీవ్రమైన జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతవరణ కేంద్రం అంచనా వేసింది.
(6 / 6)
ఇవాళ రాష్ట్రంలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడకక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆయా జిల్లాలలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. జూలై 1వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఇతర గ్యాలరీలు