(1 / 7)
తిరుమల శ్రీవారిని దర్శించుకునే వారికి తెలంగాణ టూరిజం అదిరిపోయే టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే ఈ ట్రిప్ ముగుస్తుంది.
(2 / 7)
(3 / 7)
ఈ ప్యాకేజీ ధరలు చూస్తే ఒకరికి రూ. 12499గా నిర్ణయించారు. ఫ్లైట్ జర్నీ ద్వారా తిరుమలకు వెళ్తారు. హైదరాబాద్ నుంచి ప్రారంభమవుతారు. ఫ్రీగా శ్రీవారి శీఘ్రదర్శనం ఉంటుంది. తిరుమలతో పాటు మరికొన్ని ఆలయాలను కూడా సందర్శించుకునే వీలు ఉంటుంది.
(4 / 7)
ఉదయం 6.55 గంటలకు హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతారు 9.30 AMకు తిరుపతి ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. హోటల్ కు వెళ్లి ఫ్రెషప్ అవుతారు. తిరుపతి నుంచి కారులో తిరుమలకు చేరుకుంటారు. మధ్యాహ్నం 1 గంటలకు శ్రీవారి దర్శనం పూర్తి అవుతుంది.
(5 / 7)
మధ్యాహ్నం 2 గంలటకు లంచ్ ఉంటుంది. ఆ తర్వాత పద్మావతి ఆలయానికి వెళ్తారు. 03. 30గంటలలోపు దర్శనం పూర్తి అవుతుంది. 5.30PM కు ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
(6 / 7)
6.35 PM గంటలకు తిరుపతి నుంచి ఫ్లైట్ బయల్దేరుతుంది. 7.45PM గంటలకు హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టుకు చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
(7 / 7)
తెలంగాణ టూరిజం ద్వారా టికెట్లు బుకింగ్ చేసుకుంటునే శ్రీవారి శ్రీఘ్ర దర్శన సౌకర్యం ఉంటుంది.సొంత వాహనాల్లో వచ్చి దర్శన టికెట్లు కోసం రిపోర్ట్ చేస్తే టీటీడీ అధికారులు తిరస్కరిస్తారు. మీ డబ్బులు వాపస్ కూడా ఇవ్వబడవుని తెలంగాణ టూరిజం అధికారులు స్పష్టం చేస్తున్నారు,.ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 9848540371 నెంబర్ ను సంప్రదించవచ్చు.
(image source /unsplash.com)ఇతర గ్యాలరీలు