తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Govt Jobs 2024 : తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌లో ఉద్యోగాలు - వచ్చే నెల 11 వరకు దరఖాస్తుల స్వీకరణ, ముఖ్య వివరాలివే

TG Govt Jobs 2024 : తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌లో ఉద్యోగాలు - వచ్చే నెల 11 వరకు దరఖాస్తుల స్వీకరణ, ముఖ్య వివరాలివే

24 October 2024, 14:39 IST

google News
    • TG Medical Council Recruitment 2024: తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. జూనియర్ అసిస్టెంట్, విజిలెన్స్ ఆఫీసర్ పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. అర్హులైన వారు నవంబర్ 11లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఆఫ్ లైన్ లో మాత్రమే స్వీకరిస్తున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఉద్యోగాలు
తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఉద్యోగాలు

తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఉద్యోగాలు

తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుంచి రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా మూడు పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో జూనియర్ అసిస్టెంట్ పోస్టు ఒకటి ఉండగా... మరో రెండు విజిలెన్స్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ పోస్టును డైరెక్ట్ రిక్రూట్ మెంట్ చేస్తుండగా... విజిలెన్స్ ఆఫీసర్ పోస్టులను కాంట్రాక్ట్ బేస్ విధానంలో భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇటీవలే రాసిన గ్రూప్ 4 పరీక్షలో అర్హత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 48 -44 ఏళ్ల లోపు ఉండాలి. నెలకు జీతం రూ. 24280 నుంచి 72850 వరకు ఉంటుంది. ఇక విజిలెన్స్ ఆఫీసర్ పోస్టుకు డిగ్రీ ఉండాలి... ఎల్ ఎల్ బీ డిగ్రీ ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. నెల జీతం రూ. 70 వేలుగా ఉంది.

అర్హత ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 25 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు నవంబర్ 11వ తేదీని తది గడువుగా నిర్ణయించారు. వెయ్యి రూపాయల డీడీ చెల్లించి... ఛైర్మన్, మెడికల్ కౌన్సిల్ , సుల్తాన్ బజార్, హైదరాబాద్ - 500095 చిరునామాకు పోస్ట్ చేయాలి. బయో డేటా, విద్యా అర్హతలు, పని చేసిన అనుభవ పత్రాలతో పాటు డీడీని తప్పనిసరిగా జత చేయాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

డీఆర్డీవో హైదరాబాద్ లో ఉద్యోగాలు :

హైదరాబాద్‌ డీఆర్డీవోకి అనుబంధంగా ఉండే రిసెర్చ్ సెంటర్ ఇమారత్‌ (RCI)లో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం నోటిఫికేషన్ జారీ అయింది. ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరో నాలుగు రోజుల్లో అప్లికేషన్ల గడవు పూర్తి కానుంది. తాత్కాలిక ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

డీఆర్డీవో హైదరాబాద్ నోటిఫికేషన్ వివరాల ప్రకారం… మొత్తం 22 ఖాళీలు ఉన్నాయి. ఇందులో రిసెర్చ్ అసోసియేట్ పోస్టులు మూడు ఉండగా… జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు 19 ఉన్నట్లు పేర్కొన్నారు. రెండేళ్ల కాలపరిమితితో వీటిని భర్తీ చేయనున్నారు. Electronics & Communication ఇంజినీరింగ్ విభాగంతో పాటు ఫిజిక్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, మెకానికల్, కెమికల్, మెటలర్జీ విభాగాల్లో పోస్టులు ఉన్నాయి.

పోస్టును బట్టి విద్యార్హతలు నిర్ణయించారు. పూర్తిస్థాయి నోటిఫికేషన్ లో క్లుప్తంగా వివరాలను పేర్కొన్నారు. సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, ఎంటెక్/ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత ఉండాలి. పని అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 35 ఏళ్లు మించి ఉండకూడదు. రిజర్వేషన్ ఉన్నవారికి సడలింపు ఉంటుంది.

దరఖాస్తులను https://www.drdo.gov.in/drdo/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వివరాలను పూర్తి చేసి…. ‘ హెడ్ హెచ్ఆర్‌డీ, డాక్టర్ ఏపీజే అబ్దు్ల్ కలాం మిసైల్ కాంప్లెక్స్‌, రిసెర్చ్ సెంటర్ ఇమారత్(ఆర్‌సీఐ), విజ్ఞాన కంచ, హైదరాబాద్, తెలంగాణ - 500 069’ చిరునామకు పంపించాలి. ఈ నోటిఫికేషన్ సెప్టెంబర్ 27వ తేదీన వెలువడింది.

తదుపరి వ్యాసం