MGNREGA Field Assistant : ఉపాధి హామీ స్కీమ్ లో 650 ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ, త్వరలో జిల్లాల వారీగా నోటిఫికేషన్లు
MGNREGA Field Assistant : ఏపీలో ఉపాధి హామీ పథకంలో 650 ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు త్వరలో జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. పదో తరగతి అర్హత, మేరిట్ ఆధారంగా ఉద్యోగాలు కేటాయిస్తారు.

రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో 650 ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ.. జిల్లాల సంచాలకులను ఆదేశించింది. ఈ మేరకు జిల్లాల్లో అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. ఈ ఉద్యోగాల భర్తీలో నిబంధనలను సడలింపు చేయనున్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ చేయనున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 650 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉపాధి హామీ పని చేసే యువతకు అవకాశం ఇవ్వనున్నారు.
ఈ ఉద్యోగాలకు 2021-22, 2022-23, 2023-24, 2024-25 సంవత్సరాల్లో ఏదైనా ఒక సంవత్సరంలో ఉపాధి హామీ పథకంలోని మేట్, లేదా కూలీగా ఉపాధి హామీ పనికి 25 రోజులు హాజరై ఉన్నవారు మాత్రమే అర్హులు. ఈ పోస్టులను ఎంపికకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. కేవలం మెరిట్ ఆధారంగానే ఎంపిక ఉంటుంది. ఉద్యోగాలకు ప్రస్తుతం జిల్లాల వారీగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఆయా జిల్లాల్లో నోటిఫికేషన్స్ విడుదల చేస్తారు. ఆ తరువాత అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫీల్డ్ అసిస్టెంట్స్ ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జిల్లా జల యాజమన్య సంస్థ పథక సంచాలకులకు ఆదేశించింది. కాబట్టి ఈ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీపై కొన్ని సడలింపులను కూడా తీసుకుంది. 2024-25 సంవత్సరంలో పని చేసిన పని దినాలను పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశించింది. అలాగే పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే దానికి తోడు 25 రోజుల పాటు ఉపాధి హామీ పథకం కింద పని చేయాల్సి ఉంటుంది. 18 నుంచి 42 ఏళ్ల వయస్సు వయో పరిమితిని విధించింది. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు ఐదేళ్లు, బీసీలకు మూడేళ్లు సడలింపు ఉంటుంది. ఫీల్డ్ అసిస్టెంట్ల ఆదాయం నెలకు రూ.18 వేల నుంచి రూ.25 వేలు వరకు ఉండొచ్చు. స్థానిక గ్రామాల్లో యువతకు అవకాశం ఉంటుంది.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం