తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Inter Results 2024 Updates : ఆ రోజే తెలంగాణ ఇంటర్ ఫలితాలు..? తాజా అప్డేట్ ఇదే

TS Inter Results 2024 Updates : ఆ రోజే తెలంగాణ ఇంటర్ ఫలితాలు..? తాజా అప్డేట్ ఇదే

18 April 2024, 17:38 IST

google News
    • Telangana Inter Results 2024 Updates : తెలంగాణ ఇంటర్ ఫలితాలు రాబోతున్నాయి. ఆ దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. వచ్చే వారంలో ఫలితాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2024
తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2024

తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2024

Telangana Inter Results 2024 Updates : ఇంటర్ ఫలితాల కోసం తెలంగాణలోని విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాదికి సంబంధించి 9 లక్షల మందికిపైగా పరీక్షలు రాశారు. వీరంతా కూడా రిజల్ట్స్(Telangana Inter Results) ఎప్పుడు వస్తాయనేది ఉత్కంఠగా చూస్తున్నారు. అయితే ఫలితాలను సాధ్యమైనంత త్వరగా ప్రకటించేందుకు అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియను(Telangana Inter Spot Valuation 2024) పూర్తి చేశారు అధికారులు. అయితే సాంకేతికపరమైన అంశాలను పరిశీలిస్తున్నారు. ఈ ప్రక్రియ కూడా దాదాపు పూర్తి కావొచ్చననట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఫలితాలను ప్రకటించేందుకు ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చినట్లు తెలిసింది.

ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే…?

తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చే వారంలో ప్రకటించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే అన్ని ప్రక్రియలు దాదాపు పూర్తి కావటంతో ఈసీ అనుమతితో ఫలితాలను ప్రకటించనున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ప్రభుత్వ అనుమతి లేకుండానే… కేవలం ఈసీ అనుమతితో అధికారులే విడుదల చేస్తారు. అయితే ఈ ఫలితాలను ఏప్రిల్ 23వ తేదీన ప్రకటించేందుకు ప్రాథమికంగా ఓ తేదీని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ తేదీ కుదరకపోతే… ఏప్రిల్ 25లోపే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది. మొత్తంగా చూస్తే ఏప్రిల్ 25వ తేదీలోపే ఈసారి తెలంగాణ ఇంటర్ ఫలితాలు(Telangana Inter Results) వచ్చే అవకాశం ఉంది. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా ఒకేసారి ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలతో పాటు ఒకేషనల్ రిజల్ట్స్ రానున్నాయి.

How To Check TS Inter Results : హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో ఇంటర్ ఫలితాలు

గతేడాది మాదిరిగానే ఈసారి కూడా తెలంగాణ ఇంటర్ పరీక్షల(TS Inter Exams 2024) ఫలితాలను హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో అందుబాటులోకి రానున్నాయి. ఇంటర్ బోర్డు విడుదల చేసిన క్షణాల వ్యవధిలోనే HT తెలుగు సైట్ లో మీ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. https://telugu.hindustantimes.com/telangana-board-result లింక్ పై క్లిక్ చేసి మీ రిజల్ట్స్ ను చూడొచ్చు.

ఈసారి తెలంగాణ ఇంటర్ పరీక్షలకు మొత్తం 9,22,520 మంది విద్యార్థులు ఎగ్జామ్ ఫీజును చెల్లించారు. ఇందులో 4,78,527 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఉండగా... 4 లక్షలకుపైగా సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నారు.  ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఇంటర్ బోర్డు సైట్ https://tsbie.cgg.gov.in/home.do  లోనూ చెక్ చేసుకోవచ్చు.

తదుపరి వ్యాసం