HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Govt Jobs 2024 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 1284 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలు ఇవే

TG Govt Jobs 2024 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 1284 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలు ఇవే

12 September 2024, 9:48 IST

    • TG Govt Jobs 2024 : తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే పలు నోటిఫికేషన్లు విడుదల చేసిన ప్రభుత్వం.. తాజాగా 1284 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు

తెలంగాణలో 1284 ల్యాబ్‌ టెక్నీషియన్‌ గ్రేడ్‌-2 పోస్టుల భర్తీకి వైద్యారోగ్య సేవల రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ పరిధిలో 1088 పోస్టులు, వైద్య విధానపరిషత్‌లో 183, ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రిలో 13 పోస్టులు భర్తీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

సెప్టెంబర్ 21 తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులు వివరించారు. నవంబర్ 10వ తేదీన కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నారు. 100 పాయింట్ల ఆధారంగా ఎంపిక ఉంటుందని అధికారులు చెప్పారు. ఆన్‌లైన్‌ పరీక్షకు 80 పాయింట్లు, ప్రభుత్వ సర్వీసుకు 20 పాయింట్లు ఉంటాయని వైద్యారోగ్య సేవల రిక్రూట్‌మెంట్‌ బోర్డు అధికారులు వివరించారు.

దీనికి సంబంధించి ముఖ్యాంశాలు..

1.ఆన్‌లైన్ అప్లికేషన్ 21.9.2024 నుంచి ప్రారంభం అవుతుంది.

2.ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ 5.10.2024 సాయంత్రం 5 గంటలు.

3.దరఖాస్తుదారులు తమ దరఖాస్తులను 7.10.2024 ఉదయం 10 గంటలకు, 8.10.2024 సాయంత్రం 5 గంటలకు సవరించుకోవచ్చు.

4.10.11.2024 తేదీన పరీక్ష ఉంటుంది.

5.ఆన్‌లైన్‌లో సమర్పించిన దరఖాస్తులను మాత్రమే ఆమోదిస్తారు.

6.ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ పరిధిలో 1088 పోస్టులకు రూ.32,810 నుంచి రూ.96,890 వరకు పే స్కేల్ ఉంటుంది.

7.వైద్య విధానపరిషత్‌లో 183 పోస్టులకు సంబంధించి రూ.32,810 నుంచి రూ.96,890 వరకు పే స్కేల్ ఉంటుంది.

8.ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రిలో 13 పోస్టులకు రూ.31,040 నుంచి రూ.92,050 వరకు పే స్కేల్ ఉంటుంది.

ఇవి అప్‌లోడ్ చేయాలి..

1.ఆధార్ కార్డ్

2.SSC లేదా 10వ తరగతి సర్టిఫికేట్ (పుట్టిన తేదీ రుజువు కోసం)

3.సంబంధిత డిగ్రీ కన్సాలిడేటెడ్ మార్కుల మెమో

4.సంబంధిత అర్హత పరీక్ష సర్టిఫికేట్

5.పారా మెడికల్ బోర్డ్, తెలంగాణ జారీ చేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్

6.అనుభవ ధృవీకరణ పత్రం (వర్తిస్తే)

7.స్టడీ సర్టిఫికేట్లు (1 నుండి 7వ తరగతి).

8.నివాస ధృవీకరణ పత్రం

HT Telugu ఫేస్‌బుక్ పేజీ ద్వారా అప్‌డేట్స్ పొందండి
తదుపరి వ్యాసం
నోటిఫికేషన్ సెంటర్