తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Genco Exams : ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ - తెలంగాణ జెన్ కో పరీక్షలు వాయిదా, తాజా ప్రకటన ఇదే

TS Genco Exams : ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ - తెలంగాణ జెన్ కో పరీక్షలు వాయిదా, తాజా ప్రకటన ఇదే

28 March 2024, 18:32 IST

google News
    • TS Genco Exam Updates: తెలంగాణ జెన్ కో ఏఈ, కెమిస్ట్ పోస్టుల రాత పరీక్ష వాయిదా పడింది. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని జెన్ కో ప్రకటించింది. 
తెలంగాణ జెన్ కో
తెలంగాణ జెన్ కో

తెలంగాణ జెన్ కో

TS Genco Exam 2024: ఏఈతో పాటు కెమిస్ట్ ఉద్యోగ పరీక్షలపై కీలక ప్రకటన చేసింది తెలంగాణ జెన్ కో(Telangana Genco). ఎన్నికల కోడ్ అమల్లోకి రావటంతో ఈ నెల మార్చి 31వ తేదీన జరగాల్సిన ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించింది.

తెలంగాణ జెన్ కో ప్రకటన

టీఎస్ జెన్ కో సంస్థలో మొత్తం 339 అసిస్టెంట్ ఇంజినీర్, 60 కెమిస్ట్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్వహణతో పాటు పాత విద్యుత్ కేంద్రాలలో పనిచేసేందుకు ఈ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు జెన్ కో ప్రకటించింది. ఈ మేరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది.

మొత్తం 339 అసిస్టెంట్ ఇంజినీర్, 60 కెమిస్ట్‌ పోస్టుల భర్తీకి గత ఏడాది అక్టోబరు 5న నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థుల నుంచి అక్టోబరు 7 నుంచి నవంబరు 10 వరకు అప్లికేషన్లు స్వీకరించారు. నవంబరు 14, 15 తేదీల్లో దరఖాస్తుల సవరణకు అభ్యర్థులకు అవకాశం కల్పించారు. డిసెంబర్‌ 17న రాత పరీక్ష నిర్వహిస్తామ‌ని జెన్ కో ప్రక‌టించింది. అయితే అసెంబ్లీ ఎన్నికలతో పాటు పలు కారణాలతో ఈ పరీక్ష వాయిదా ప‌డింది. అయితే తిరిగి మార్చి 31వ తేదీన పరీక్షలను నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు జెన్ కో(Telangana Genco Ecams 2024) ప్రకటన కూడా విడుదల చేసింది. మెకానికల్, కెమిస్ట్ అభ్యర్థులకు షిఫ్ట్‌-1 ఉదయం 9.00 నుంచి 10.40 వరకు, ఎలక్ట్రికల్ అభ్యర్థులకు షిఫ్ట్‌-2 మధ్యాహ్నం 1.00 నుంచి 2.40 వరకు, సివిల్, ఎలక్ట్రానిక్స్ అభ్యర్థులకు షిఫ్ట్‌-3 సాయంత్రం 5.00 నుంచి 6.40 వరకు రాత పరీక్ష నిర్వహిస్తామని కూడా తెలిపింది.

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో…. అన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో మరోసారి ఈ పరీక్షలను వాయిదా వేయాల్సి వచ్చింది. ఎన్నికల కోడ్ పూర్తి అయిన తర్వాత.. కొత్త తేదీలను వెబ్ సైట్ లో తెలుపుతామని జెన్ కో తాజాగా విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.

తదుపరి వ్యాసం