తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Ssc Results 2024 Updates : 'స్పాట్ వాల్యూయేషన్' షురూ - తెలంగాణ పదో తరగతి ఫలితాలు ఎప్పుడంటే..?

TS SSC Results 2024 Updates : 'స్పాట్ వాల్యూయేషన్' షురూ - తెలంగాణ పదో తరగతి ఫలితాలు ఎప్పుడంటే..?

03 April 2024, 15:05 IST

google News
    • Telangana SSC Exam Results 2024 Updates : తెలంగాణ పదో తరగతి పరీక్షల స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియ ఇవాళ్టి(ఏప్రిల్ 3)నుంచి ప్రారంభమైంది. ఏప్రిల్ 11వ తేదీతో పూర్తి కానుంది. ఆ తర్వాత ఫలితాలను ప్రకటించనున్నారు
తెలంగాణ పదో తరగతి ఫలితాలు - 2024
తెలంగాణ పదో తరగతి ఫలితాలు - 2024

తెలంగాణ పదో తరగతి ఫలితాలు - 2024

Telangana SSC Exam Results 2024 : తెలంగాణ పదో తరగతి జవాబు పత్రాల స్పాట్ వాల్యూయేషన్(Spot-Valuation of TS SSC Examinations 2024) ప్రక్రియ ఇవాళ్టి (ఏప్రిల్ 3) నుంచి షురూ అయిపోయింది. ఏప్రిల్ 11వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 19 కేంద్రాల్లో వాల్యూయేషన్ నడుస్తుండగా… ఇందుకోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది ప్రభుత్వ పరీక్షల విభాగం. మూల్యాంకన ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు చేపట్టింది. సిబ్బంది కొరత రాకుండా చర్యలు తీసుకుంది. వీలైనంత త్వరగా ఫలితాలను ప్రకటించేలా కార్యాచరణను రూపొందించింది.

తెలంగాణ పదో తరగతి జవాబు మూల్యాంకనం 11 జిల్లాల్లో నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు సిబ్బంది విధులను నిర్వహిస్తారు. స్పాట్ లో పాల్గొనే సిబ్బంది…. ప్రతిరోజూ ఒక్కరు 40 జవాబు పత్రాలను దిద్దాల్సి ఉంటుంది. ఉదయం షిఫ్ట్ లో 20, సాయంత్రం సెషల్ లో 20 పూర్తి చేస్తారు. ఏప్రిల్ 11వ తేదీతో ఈ స్పాట్ ప్రక్రియ పూర్తి కానుంది. ఆ తర్వాత మార్కుల ఎంట్రీతో పాటు సాంకేతిక అంశాలను పరిశీలన చేసి… ఫలితాలను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచేలా ప్రభుత్వ పరీక్షల విభాగం చర్యలు చేపట్టనుంది. స్పాట్ విషయంలో పాటించాల్సిన నిబంధనల విషయంలో ఇప్పటికే సిబ్బందికి అవగాహన కార్యక్రమాలను పూర్తి చేశారు.

TS 10th Results 2024: ఫలితాలు ఎప్పుడంటే..?

ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈసారి తెలంగాణ పదో తరగతి ఫలితాలు(Telangana SSC Exam Results) కాస్త ముందుగానే రానున్నాయి. 11వ తేదీతో స్పాట్ పూర్తి కానుండగా…. ఏప్రిల్ చివరి వారంలో ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. ఆ దిశగానే అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. గత ఏడాదితో పోల్చితే ఈసారి పరీక్షలు తొందరగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. 2023లో ఏప్రిల్ 3 నుంచి పరీక్షలు ప్రారంభం కాగా… ఏప్రిల్ 13వ తేదీ వరకు జరగాయి. ఫలితాలను మే 10వ తేదీన ప్రకటించారు. అయితే ఈసారి పరీక్షలు మార్చి 18వ తేదీనే మొదలయ్యాయి. ఏప్రిల్ 2వ తేదీతో అన్ని ఎగ్జామ్స్ పూర్తి అయ్యాయి. గతేడాది షెడ్యూల్ తో పోల్చితే… ఫలితాల ప్రకటనకు 27 రోజుల సమయం పట్టింది. ఈసారి కూడా 25 నుంచి 30 రోజుల వ్యవధిలోనే ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే….. ఏప్రిల్ చివరి వారంలోనే పదో తరగతి ఫలితాలు(Telangana 10th Results 2024) విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది కుదరకపోతే…. మే ఫస్ట్ వీక్ లో దాదాపుగా ప్రకటించే ఛాన్స్ ఉంటుంది.

ఈ ఏడాది జరగుతున్న పరీక్షల కోసం 5.08 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ ఫీజులను చెల్లించారు. ఇందులో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు ఉన్నారు. ఈ ఎగ్జామ్స్ కోసం మొత్తం 2,676 కేంద్రాలను ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే.

How to Check TS SSC Results 2024 : పది ఫలితాలను ఇలా చెక్ చేసుకోవచ్చు…

  1. పరీక్ష రాసిన విద్యార్థులు తెలంగాణ SSC బోర్డు అధికారిక వెబ్ సైట్ https://results.bsetelangana.org/ లోకి వెళ్లాలి. లేదా https://bse.telangana.gov.in/ సైట్‌కు వెళ్లొచ్చు.
  2. హోం పేజీలో కనిపించే TS SSC Results 2024 లింక్ పై క్లిక్ చేయాలి.
  3. హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీను నమోదు చేయాలి. సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.
  4. మీ పరీక్షా ఫలితాలు డిస్ ప్లే అవుతాయి. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి మార్కుల మెమోను పొందవచ్చు.

HT తెలుగులో తెలంగాణ టెన్త్ ఫలితాలు

  • ఇక గతేడాది మాదిరిగానే ఈసారి కూడా విద్యార్థులు డైరెక్ట్‌గా హిందుస్తాన్ టైమ్స్ తెలుగు వెబ్‌సైట్ లో కూడా ఫలితాలను చెక్ చేసుకునే వీలు ఉంటుంది.
  • పరీక్ష రాసిన అభ్యర్థులు https://telugu.hindustantimes.com/telangana/results లోకి వెళ్లాలి.
  • మీ హాల్ టికెట్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి.
  • సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయగానే.. మీ ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
  • ప్రింట్ లేదా డ్లౌనోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి రిజల్ట్స్ కాపీని పొందవచ్చు.

తదుపరి వ్యాసం