TS SSC Exams 2024 : ఈనెల 18 నుంచి పదో తరగతి పరీక్షలు - ఇకపై ఆ నిబంధన లేదు..!
TS SSC Exams 2024 Updates:తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మార్చి 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. ఈసారి నిమిషం నిబంధనను ఎత్తివేయగా... 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా విద్యార్థులను అనుమతించనుంది.
Telangana SSC Exams 2024 : తెలంగాణలో పదో తరగతి పరీక్షలకు(Telangana SSC Exams) పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. గతంలో పేపర్ లీకేజీ వంటి పరిణామాలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఈసారి అలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా గట్టి చర్యలు చేపట్టింది. ఎగ్జామ్ సెంటర్ల వద్ద 144 సెక్షన్ ను అమల్లో ఉంచనుంది. మార్చి 18 నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా.... ఏప్రిల్ 2వ తేదీతో ముగుస్తాయి. ఈ ఏడాది 5.08 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇప్పటికే హాల్ టికెట్లు విడుదల కాగా... http://bse.telangana.gov.in వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
నిమిషం నిబంధన ఎత్తివేత….
మరోవైపు విద్యార్థులకు కీలక అలర్ట్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. గతంలో ఉన్న నిమిషం నిబంధనను ఎత్తివేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించనుంది. ఇటీవలే ఇంటర్ పరీక్షల్లోనూ నిమిషం నిబంధనను ఎత్తివేసిన సంగతి తెలిసిందే.
ఈసారి పదో తరగతి పరీక్షల(Telangana SSC Exams 2024) కోసం 2,676 కేంద్రాలను ఏర్పాట్లు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఆయా కేంద్రాల వద్ద పకడ్బందీ చర్యలను చేపట్టింది. పరీక్షా కేంద్రాల వద్ద భారీగా బందోబస్తును ఏర్పాటు చేయనుంది. పరీక్షా కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకెళ్లవద్దని.... వాటిని నిషేధిస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.
download TS SSC Hall Ticket 2024: హాల్ టికెట్లు ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు….
పదో తరగతి పరీక్ష రాసే విద్యార్థులు మొదటగా https://bse.telangana.gov.in / వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
SSC Examinsation Hall Tickets March -2024 అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
రెగ్యూలర్ హాల్ టికెట్లుతో పాటు ప్రైవేటు హాల్ టికెట్లు, ఒకేషనల్ హాల్ టికెట్లు కనిపిస్తాయి. ఇందులో మీరు ఏ కేటగిరికి సంబంధించిన వారో దానిపై క్లిక్ చేయాలి.
మీ జిల్లా, పాఠశాల, పేరు, పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ నమోదు చేసి సబ్మిట్ బటన్ నొక్కాలి.
మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే అప్షన్ పై నొక్కి హాల్ టికెట్ కాపీని పొందవచ్చు.
TS SSC Exam Dates 2024: పదో తరగతి పరీక్షల షెడ్యూల్
- మార్చి 18- ఫస్ట్ లాంగ్వేజ్(తెలుగు, కాంపోజిట్ కోర్సు)
- మార్చి 19- సెకండ్ లాంగ్వేజ్( హిందీ)
- మార్చి 21- థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్)
- మార్చి 23- మ్యాథమెటిక్స్
- మార్చి 26- సైన్స్ పేపర్ -1(ఫిజిక్స్)
- మార్చి 28- సైన్స్ పేపర్ -2(బయాలజీ)
- మార్చి 30- సోషల్ స్టడీస్
- ఏప్రిల్ 1- ఒకేషనల్ కోర్సు (సంస్కృతం, అరబిక్ మొదటి పేపర్),