తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Singareni Jobs : సింగరేణి సంస్థలో 485 ఉద్యోగాలు, రేపు నోటిఫికేషన్ విడుదల

Singareni Jobs : సింగరేణి సంస్థలో 485 ఉద్యోగాలు, రేపు నోటిఫికేషన్ విడుదల

21 February 2024, 22:11 IST

google News
    • Singareni Jobs : సింగరేణి సంస్థలో 485 పోస్టుల భర్తీకి రేపు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ మేరకు సింగరేణి సీఎండీ ప్రకటన చేశారు. దీంతో పాటు ఈ ఏడాది సింగరేణిలో 1000 వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు.
సింగరేణి సంస్థలో 485 ఉద్యోగాలు
సింగరేణి సంస్థలో 485 ఉద్యోగాలు

సింగరేణి సంస్థలో 485 ఉద్యోగాలు

Singareni Jobs : సింగరేణి సంస్థ(Singareni)లో మొత్తం 485 ఉద్యోగాల భర్తీ గురువారం నోటిఫికేషన్(Job Notification) విడుదల చేయనున్నారు. 317 డైరెక్ట్‌, 168 ఇంటర్నల్‌ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు సింగరేణి సీఎండీ తెలిపారు. బుధవారం సింగరేణి డైరెక్టర్లతో సీఎండీ బలరామ్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. కార్మికులకు రూ.కోటి ప్రమాద బీమాపై యూబీఐతో గురువారం కీలక ఒప్పందం జరుగనుందని సీఎండీ వెల్లడించారు.

1000 వారసత్వ ఉద్యోగాలు

సింగరేణిలో అభివృద్ధి, సంక్షేమంపై సీఎండీతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ... ఈ ఏడాది సింగరేణిలో 1000 వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశించారు. ఈ ఉద్యోగాలకు వయోపరిమితిని 40 ఏళ్లకు పెంచాలన్నారు. కొత్తగూడెంలో 10.5 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని భట్టి విక్రమార్క ఆదేశించారు. వేసవిలో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఈ నెల 26న కొత్తగూడెంలో సోలార్ ప్లాంట్‌ను ప్రారంభించ‌నున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. హైదరాబాద్‌లో సింగరేణి అతిథి గృహం నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు.

నల్గొండలో మెగా జాబ్ మేళా

నిరుద్యోత యువతకు గుడ్ న్యూస్ చెప్పారు నల్గొండ కలెక్టర్. 100కు పైగా కంపెనీలు 5 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 26వ తేదీన నల్గొండలో మెగా జాబ్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు. జాబ్ మేళా పోస్టర్ ను నల్గొండ కలెక్టర్ హరిచందన ఎక్స్ లో విడుదల చేశారు. ఫిబ్రవరి 26న నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలోని స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ హరిచందన ప్రకటించారు. ఈ జాబ్ మేళాలో 100కి పైగా కంపెనీల్లో 5 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు తెలిపారు. నిరుద్యోగ యువతకు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. ఈ నెల 26వ తేదీ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు నల్గొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీలోని స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో మెగా జాబ్‌ మేళా నిర్వహించనున్నారు. తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, తెలంగాణ ఫెసిలిటీ మేనేజ్మెంట్‌ కౌన్సెల్ సహకారంతో కోమటిరెడ్డి ప్రతీక్‌రెడ్డి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ మెగా జాబ్‌ మేళా నిర్వహిస్తున్నారు. ఎస్‌ఎస్‌సీ, ఐటీఐ, ఇంటర్‌, డిప్లొమా, డిగ్రీ, పీజీ అర్హత కలిగిన అభ్యర్థులు సీవీ, అర్హత సర్టిఫికెట్లతో జాబ్ మేళాకు హాజరు కావాల్సి ఉంటుంది.

తదుపరి వ్యాసం