Kendriya Vidyalaya Jobs 2024 : గోల్కొండ కేంద్రీయ విద్యాలయంలో ఉద్యోగాలు - కేవలం ఇంటర్వూనే, తేదీలివే
19 February 2024, 14:39 IST
- KVS Golconda Recruitment 2024 Updates: హైదరాబాద్ లోని గోల్కొండ కేంద్రీయ విద్యాలయం నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా…. పీజీటీ, టీజీటీ, ప్రైమరీ టీచర్ తో పాటు మరికొన్ని ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆ వివరాలను ఇక్కడ చూడండి…
కేంద్రీయ విద్యాలయ ఉద్యోగాలు
Kendriya Vidyalaya Golconda Recruitment 2024: హైదరాబాద్ లోని గోల్కొండ కేంద్రీయ విద్యాలయం -01 నుంచి రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ వచ్చింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా… టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇవే కాకుండా… పలు నాన్ టీచింగ్ పోస్టులను కూడా రిక్రూట్ చేస్తున్నారు.వీటిని తాత్కాలిక పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ముఖ్య వివరాలను పేర్కొన్నారు. ఫిబ్రవరి 20,24 తేదీల్లో ఇంటర్వూలను నిర్వహించనున్నారు. ముఖ్య వివరాలను ఇక్కడ చూడండి.
ముఖ్య వివరాలు:
రిక్రూట్ మెంట్ ప్రకటన - కేంద్రీయ విద్యాలయం -01, గొల్కోండ, హైదరాబాద్.
ఉద్యోగాలు - టీచింగ్ , నాన్ టీచింగ్
ఖాళీలు - పీజీటీ(ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, జియోగ్రఫీ, ఎకానామిక్స్, కామర్స్, కంప్యూటర్ సైన్స్)
టీజీటీ ( ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం, మ్యాథ్స్,సైన్స్, సోషల్ సైన్,
పీఆర్టీ - కంప్యూటర్ ఇన్ స్ట్రక్టర్, స్పోర్ట్స్ కోచ్, డాన్స్ కోచ్స ఎడ్యుకేషనల్ కౌన్సిలర్, స్పెషల్ ఎడ్యుకేటర్, నర్స్.
అర్హతలు - డిగ్రీ, పీజీ, బీఈడీ పూర్తి చేయటంతో పాటు పని చేసిన అనుభవం ఉండాలి. నాన్ టీచింగ్ పోస్టుల విషయానికొస్తే ఆయా కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
దరఖాస్తు - ఆఫ్ లైన్
ఎంపిక విధానం - ఇంటర్వూ, ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒక జిరాక్స్ సెట్ కూడా ఉండాలి. ఉదయం 9 గంటలకే చేరుకోవాల్సి ఉంటుంది.
ఫిబ్రవరి 20, 24 తేదీల్లో ఇంటర్వూలు ఉంటాయి.
దరఖాస్తు పత్రాలను వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.
వెబ్ సైట్ - https://no1golconda.kvs.ac.in/
అడ్రస్ -లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్ దగ్గర, గొల్కొండ, హైదరాబాద్ - 500 008.
సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ - 040- 23513701.
కింద ఇచ్చిన పీడీఎఫ్ లో దరఖాస్తు ఫారమ్ ఉంది…
Kendriya Vidyalaya Nellore Recruitment 2024: మరోవైపు ఏపీలోని నెల్లూరులోని కేంద్రీయ విద్యాలయం నుంచి రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ వచ్చింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా… టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇవే కాకుండా… పలు నాన్ టీచింగ్ పోస్టులను కూడా రిక్రూట్ చేస్తున్నారు.వీటిని పార్ట్ టైం, కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ముఖ్య వివరాలను పేర్కొంది. ఫిబ్రవరి 23,24 తేదీల్లో ఇంటర్వూలను నిర్వహించనున్నారు.
ముఖ్య వివరాలు:
రిక్రూట్ మెంట్ ప్రకటన - కేంద్రీయ విద్యాలయం, నెల్లూరు
ఉద్యోగాలు - టీచింగ్ , నాన్ టీచింగ్
ఖాళీలు - పీజీటీ(ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ)
టీజీటీ (ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్ సైన్సెస్)
ప్రైమరీ టీచర్
కంప్యూటర్ ఇన్ స్ట్రక్టర్.
యోగా టీచర్, నర్స్, స్పెషల్ ఎడ్యుకేటర్, స్పోర్ట్స్ కోచ్, ఎడ్యుకేషన్ కౌన్సిలర్, మ్యూజిక్ కోచ్.
అర్హతలు - డిగ్రీ, పీజీ, బీఈడీ పూర్తి చేయటంతో పాటు పని చేసిన అనుభవం ఉండాలి. నాన్ టీచింగ్ పోస్టుల విషయానికొస్తే ఆయా కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
దరఖాస్తు - ఆఫ్ లైన్
ఎంపిక విధానం - ఇంటర్వూ, ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒక జిరాక్స్ సెట్ కూడా ఉండాలి.
ఫిబ్రవరి 23, 24 తేదీల్లో ఇంటర్వూలు ఉంటాయి.
వెబ్ సైట్ - https://kothuru.kvs.ac.in/