తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Indian Coast Guard Recruitment : ఇండియన్​ కోస్ట్​ గార్డ్​లో ఉద్యోగాలు- పూర్తి వివరాలు..

Indian Coast Guard Recruitment : ఇండియన్​ కోస్ట్​ గార్డ్​లో ఉద్యోగాలు- పూర్తి వివరాలు..

Sharath Chitturi HT Telugu

19 February 2024, 14:39 IST

    • Indian Coast Guard Recruitment 2024 : ఇండియన్ కోస్ట్ గార్డ్​లో వివిద పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ పడింది. రిక్రూట్​మెంట్​ ప్రక్రియ ప్రారంభమైంది. పూర్తి వివరాలు..
ఇండియన్​ కోస్ట్​ గార్డ్​లో ఉద్యోగాలు- పూర్తి వివరాలు..
ఇండియన్​ కోస్ట్​ గార్డ్​లో ఉద్యోగాలు- పూర్తి వివరాలు..

ఇండియన్​ కోస్ట్​ గార్డ్​లో ఉద్యోగాలు- పూర్తి వివరాలు..

Indian Coast Guard Recruitment 2024 apply online : ఇండియన్ కోస్ట్ గార్డ్​లోని 70 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి ఆన్​లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు joinindiancoastguard.cdac.in అధికారిక వెబ్​సైట్​లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ 2024 మార్చి 6. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ట్రెండింగ్ వార్తలు

Rishi Sunak net worth : కింగ్​ చార్లెస్​ కన్నా.. రిషి సునక్​- అక్షతా మూర్తులే ధనవంతులు!

Naturals Ice Cream : నేచురల్స్​ ఐస్​క్రీమ్​ వ్యవస్థాపకుడు రఘునందన్​ కామత్​ కన్నుమూత..

Thief Lawyer: కి‘‘లేడీ లాయర్’’.. కోర్టులోనే దర్జాగా దొంగతనాలు; ఎట్టకేలకు అరెస్ట్

COVID-19: మళ్లీ కోవిడ్-19 కలకలం; సింగపూర్ లో వారం రోజుల్లో 25,900 కేసులు నమోదు

ఇండియన్ కోస్ట్ గార్డ్ అసిస్టెంట్ కమాండెంట్ రిక్రూట్​మెంట్: ఖాళీల వివరాలు

  • జనరల్ డ్యూటీ (జీడీ): 50 ఖాళీలు
  • టెక్ (ఇంజినీరింగ్ / ఎలెక్ట్): 20

ఖాళీలు పోస్టులకు అర్హతలు:

Indian Coast Guard Recruitment notification : జనరల్ డ్యూటీ (జీడీ) పోస్టులకు అప్లై చేస్తున్న అభ్యర్థులు.. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ సర్టిఫికేట్​ పొంది ఉండాలి.

టెక్నికల్ (మెకానికల్) పోస్టులకు అప్లై చేస్తున్న అభ్యర్థులు.. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి నేవల్ ఆర్కిటెక్చర్ లేదా మెకానికల్ లేదా మెరైన్ లేదా ఆటోమోటివ్ లేదా మెకట్రానిక్స్ లేదా ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ లేదా మెటలర్జీ లేదా డిజైన్ లేదా ఏరోనాటికల్ లేదా ఏరోస్పేస్​లో కనీసం 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్ డిగ్రీ పొంది ఉండాలి.

టెక్నికల్ (ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్)కు కనీసం 60 శాతం మార్కులతో ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా టెలికమ్యూనికేషన్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా పవర్ ఇంజనీరింగ్ లేదా పవర్ ఎలక్ట్రానిక్స్​లో ఇంజనీరింగ్ డిగ్రీ పొంది ఉండాలి.

వయస్సు పరిమిత:- అభ్యర్థుల వయసు.. 2024 జూలై 1 నాటికి 21-25 ఏళ్ల మధ్య ఉండాలి.

ఇండియన్ కోస్ట్ గార్డ్ అసిస్టెంట్ కమాండెంట్ రిక్రూట్ మెంట్: దరఖాస్తు ఫీజు

Indian coast guard recruitment 2024 assistant commandant : రూ.300, నెట్ బ్యాంకింగ్ లేదా వీసా/ మాస్టర్ / మాస్ట్రో / రూపే / క్రెడిట్ / డెబిట్ కార్డు / యుపిఐ ఉపయోగించి ఆన్ లైన్ లో చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఆర్​ఆర్​బీ రిక్రూట్​మెంట్​..

RRB Technician Recruitment 2024 : రైల్వేలో భారీ రిక్రూట్మెంట్ కు తెర లేచింది. త్వరలో రైల్వే విభాగంలోని 9000 టెక్నీషియన్ పోస్ట్ లను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB Technician Recruitment 2024:) భర్తీ చేయనుంది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మార్చి 9న ప్రారంభమవుతుంది. అప్లికేషన్ ఫాం సమర్పించడానికి ఏప్రిల్ 8 చివరి తేదీ. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక ఆర్ఆర్బీ వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. విభాగాల వారీగా ఖాళీలు సహా పూర్తి వివరాలు మార్చి 9న అన్ని ఆర్ఆర్బీ వెబ్సైట్లలో విడుదల చేయనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం