డిప్యూటీ మేనేజర్ (టెక్నికల్) పోస్టుల భర్తీకి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఎన్ హెచ్ ఏ ఐ అధికారిక వెబ్ సైట్ nhai.gov.in ద్వారా ఆన్ లైన్ లో ఫిబ్రవరి 15వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు.
ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 60 డిప్యూటీ మేనేజర్ (టెక్నికల్) పోస్ట్ లను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్ట్ లకు అప్లై చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / ఇన్ స్టిట్యూట్ నుండి సివిల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే, అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 30 ఏళ్లు. ఈ పోస్ట్ లకు అభ్యర్థులను యూపీఎస్సీ నిర్వహించే ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఈఎస్) ఎగ్జామినేషన్ (సివిల్) 2023లో తుది మెరిట్ (రాత పరీక్ష & పర్సనాలిటీ టెస్ట్) ఆధారంగా ఎంపిక చేస్తారు.
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) లో డిప్యూటీ మేనేజర్ (టెక్నికల్) పోస్ట్ లకు కింది స్టెప్స్ ఫాలో కావడం ద్వారా అప్లై చేసుకోవచ్చు.