RRB Technician Recruitment 2024: ఆర్ఆర్బీ లో మెగా రిక్రూట్మెంట్ డ్రైవ్; ఏకంగా 9 వేల పోస్ట్ ల భర్తీ
RRB Technician Recruitment 2024: రైల్వేలో భారీ రిక్రూట్మెంట్ కు రంగం సిద్ధమైంది. ఏకంగా 9 వేల పోస్ట్ లతో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) మెగా రిక్రూట్మెంట్ కు తెర తీసింది. దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రక్రియ మార్చి 9వ తేదీన ప్రారంభం కానుంది.
RRB Technician Recruitment 2024: రైల్వేలో భారీ రిక్రూట్మెంట్ కు తెర లేచింది. త్వరలో రైల్వే విభాగంలోని 9000 టెక్నీషియన్ పోస్ట్ లను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB Technician Recruitment 2024:) భర్తీ చేయనుంది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మార్చి 9న ప్రారంభమవుతుంది. అప్లికేషన్ ఫాం సమర్పించడానికి ఏప్రిల్ 8 చివరి తేదీ. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక ఆర్ఆర్బీ వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. విభాగాల వారీగా ఖాళీలు సహా పూర్తి వివరాలు మార్చి 9న అన్ని ఆర్ఆర్బీ వెబ్సైట్లలో విడుదల చేయనున్నారు.
ఆర్ఆర్బీ టెక్నీషియన్ రిక్రూట్మెంట్ 2024 ఖాళీల వివరాలు: ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్లో 9000 ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీటిలో 1100 ఖాళీలు టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్, 7900 ఖాళీలు టెక్నీషియన్ గ్రేడ్ 3 సిగ్నల్.
ఆర్ఆర్బీ టెక్నీషియన్ రిక్రూట్మెంట్ 2024 వయో పరిమితి: టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ కు అభ్యర్థుల గరిష్ట వయస్సు 18 నుండి 36 సంవత్సరాలు. టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు అభ్యర్థుల గరిష్ట వయస్సు 18 నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఆర్ఆర్బీ టెక్నీషియన్ రిక్రూట్మెంట్ 2024 దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్, దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్జెండర్లు, మైనారిటీలు లేదా ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు దరఖాస్తు ఫీజు రూ.250. మిగతా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.500.
ఆర్ఆర్బీ టెక్నీషియన్ రిక్రూట్మెంట్ 2024 విద్యార్హతలు: మార్చి 9వ తేదీన అధికారిక ఆర్ఆర్బీ వెబ్సైట్లో విభాగాల వారీగా పూర్తి విద్యార్హతలను విడుదల చేస్తారు.