South Central Railway : దయచేసి వినండి.. జనవరి 9 వరకు ఈ రైళ్లు రద్దు అయ్యాయండి!
21 December 2024, 12:28 IST
- South Central Railway : కాజీపేట- కొండపల్లి సెక్షన్‌లో మూడో రైల్వే లైన్ పనులు జరుగుతున్నాయి. దీంతో పలు రైళ్లను రద్దు చేసినట్టు అధికారులు వెల్లడించారు. డిసెంబర్ 25 నుంచి జనవరి 9 వరకు రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. ప్రయాణికులు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
జనవరి 9 వరకు రైళ్లు రద్దు
సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోని కాజీపేట- కొండపల్లి సెక్షన్ మోటమర్రి రైల్వే స్టేషన్ వద్ద మూడో రైల్వే లైన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నాన్ ఇంటర్ లాకింగ్ పనుల దృష్ట్యా ఉమ్మడి వరంగల్ జిల్లాలో నడిచే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేసింది. ఇంకొన్నింటిని దారి మళ్లించింది. దీంతో ఈ నెల 25 నుంచి జనవరి 9 వరకు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగనుంది.
రద్దయిన రైళ్లు ఇవే..
డిసెంబరు 25- జనవరి 9 మధ్య.. కాజీపేట- డోర్నకల్ మెమూ (07753), డోర్నకల్- కాజీపేట మెమూ (07754), డోర్నకల్- విజయవాడ మెమూ (07755), విజయవాడ- డోర్నకల్ మెమూ(07756), విజయవాడ- భద్రాచలం రోడ్డు మెమూ (07979), భద్రాచలం రోడ్డు- విజయవాడ మెమూ (07278) డిసెంబరు 28, 29, జనవరి 02, 05, 07, 08, 09 తేదీల్లో.. 12705 గుంటూరు- సికింద్రాబాద్ ఇంటర్‌సిటి ఎక్స్‌ప్రెస్, 12706 సికింద్రాబాద్- గుంటూరు ఇంటర్‌సిటి ఎక్స్‌ప్రెస్, డిసెంబరు 27, జనవరి 01, 04, 07, 08, 09 తేదీల్లో.. 12713 విజయవాడ- సికింద్రాబాద్ శాతవాహన ఎక్స్‌ప్రెస్, 12714 సికింద్రాబాద్- విజయవాడ శాతవాహన ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు అయ్యాయి.
పాక్షికంగా రద్దైన రైళ్లు..
డిసెంబరు 27- జనవరి 09 మధ్య... 17201, 17202 గోల్కొండ ఎక్స్‌ప్రెస్ రైలును రద్దు చేశారు. దూర ప్రాంతాల మధ్య నడిచే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను దారి మళ్లించారు. జనవరి 07, 08, 09 తేదీల్లో నంబరు 20834 విశాఖపట్నం వందేభారత్ రైలు, డిసెంబరు 27, 28, జనవరి 01, 04, 06, 07, 08 తేదీల్లో నం.17406 ఆదిలాబాద్- తిరుపతి కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలును రీ-షెడ్యూల్ చేశారు. ఈ మార్పులను ప్రయాణికులు గమనించాలని అధికారులు సూచించారు.
24 రైళ్లు రద్దు..
తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను మార్చి 2 వరకు దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండం బలపడే అవకాశముందన్న సమాచారంతో.. అధికారులు తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే 24 రైళ్లను రద్దు చేశారు. వాటి వివరాలను సౌత్ సెంట్రల్ రైల్వే వెబ్సైట్లో అధికారులు ఉంచారు.