తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Modi Photo On Lpg Cylinder : మోదీ ఫొటో ఏదన్న కేంద్రమంత్రి.. ఇదిగో అంటూ టీఆర్ఎస్ కౌంటర్

Modi Photo On LPG Cylinder : మోదీ ఫొటో ఏదన్న కేంద్రమంత్రి.. ఇదిగో అంటూ టీఆర్ఎస్ కౌంటర్

Anand Sai HT Telugu

04 September 2022, 16:55 IST

    • 'అంత గొప్ప నాయకుడి ఫోటో పెట్టడానికి మీకెందుకు అభ్యంతరం? దయచేసి ప్రధానమంత్రి ఫొటో తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి.' అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఒక రేషన్ దుకాణాన్ని సందర్శించినప్పుడు చెప్పారు. ఈ విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది. అది కూడా కౌంటర్ ఇచ్చెందుకు..
గ్యాస్ సిలిండర్లపై మోదీ ఫొటో
గ్యాస్ సిలిండర్లపై మోదీ ఫొటో

గ్యాస్ సిలిండర్లపై మోదీ ఫొటో

Modi Photo On Gas Cylinders : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కామారెడ్డిలో పర్యటించారు. రేషన్ దుకాణంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫొటో ఎక్కడ అని సీరియస్ అయ్యారు. కామారెడ్డి కలెక్టరపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని టీఆర్ఎస్ నేతలు సీరియస్ గా తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి(TRS) మద్దతుదారులు సెప్టెంబర్ 3న LPG సిలిండర్లపై ప్రధాని మోదీ ఫొటో వేశారు. దాంతో పాటు ధరలను ప్రింట్ చేశారు. వంటగ్యాస్ సిలిండర్లపై వేసిన పోస్టర్లలో ఒక్కో సిలిండర్ ధర రూ.1,105తో పాటు మోదీ ఫొటోలు కూడా ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Dogs Killed Goats: కుక్కల దాడిలో మేకల మృతి, మేక కళేబరాలతో మునిసిపల్ కార్యాలయంలో ఆందోళన

Kamareddy DMHO: కామారెడ్డిలో కామపిశాచి, వైద్యులపై వేధింపుల కేసుతో జిల్లా వైద్యాధికారి అరెస్ట్

BRS Protest: బోనస్ బోగసేనా?... రోడ్డెక్కిన బీఆర్ఎస్.. ప్రభుత్వ తీరుపై ధర్నాలు, రాస్తారోకోలతో BRS నిరసన

Graduate Mlc Election: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీపై బీజేపీ గురి, కీలక నేతలకు ఇన్‌ఛార్జి బాధ్యతలు

ఎనిమిదేళ్లుగా వంటగ్యాస్‌ ధరలను భారీగా పెంచడంపై ప్రధానమంత్రిని టీఆర్‌ఎస్‌ విమర్శిస్తూనే ఉంది. 2014లో మోదీ ప్రధాని అయ్యాక ఎల్పీజీ ధర రూ.410 మాత్రమేనని టీఆర్‌ఎస్ నేతలు అంటున్నారు. ఆ విషయాన్ని చెబుతూ.. గ్యాస్ సిలిండర్లపై మోదీ ఫొటోను ప్రింట్ చేశారు. మీకు మోదీ చిత్రాలు కావాలా.. ఇక్కడ మీరు చూడొచ్చంటూ వైరల్ చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో ఫ్లెక్సీ ఏర్పాటు వ్యవహారం ఒక్కసారిగా వైరల్ అయింది. టీఆర్‌ఎస్‌-బీజేపీల మధ్య మాటల తుటాలు పేల్చుకుంటున్నారు. తమ మనుషులొచ్చి వాటిని ఏర్పాటు చేస్తారని.. తొలగించకుండా చూసుకునే బాధ్యత మీదే అంటూ కామారెడ్డి జిల్లా అధికారులకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ఈ వ్యవహారంపై తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు కూడా సీరియస్ అయ్యారు.

'అంత గొప్ప నాయకుడి ఫోటో పెట్టడానికి మీకెందుకు అభ్యంతరం? దయచేసి ప్రధానమంత్రి ఫ్లెక్స్ తీసుకొచ్చి ఇక్కడ ఉంచండి. COVID-19 సమయంలోనూ.. రేషన్ కొనడానికి ప్రజల వద్ద నగదు ఉందో లేదో అని ఉచితంగా ఇచ్చారు. తెలంగాణలో కూడా ప్రధాని ఫ్లెక్స్‌ పెట్టాలని కోరితే అనుమతించడం లేదు. మా వాళ్లు పెట్టే ప్రయత్నం చేస్తే అడ్డుకుని ఫ్లెక్స్ చించి విసిరేస్తున్నారు.' అని నిర్మలా సీతారామన్ కామారెడ్డి జిల్లా అధికారులకు చెప్పారు.

ఆ తర్వాతనే టీఆర్ఎస్ నేతలు ఓ వీడియోను వైరల్ చేశారు. వంటగ్యాస్‌ సిలిండర్లతో వెళ్తున్న ఓ ట్రాలీలో గ్యాస్‌ బండలకు ప్రధాని మోదీ ఫొటోలు అంటించి ఉన్నాయి. వాటి మీద మోదీజీ రూ.1105 అని రాసి పెట్టారు. ఇది టీఆర్‌ఎస్‌ సెటైర్‌ అని అందరికీ అర్థమయ్యేలా ఉంది. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌గారూ మీరు చెప్పినట్లే చేశామా? అంటూ టీఆర్‌ఎస్‌ నేతలు వీడియోను వైరల్ చేస్తున్నారు.

ఇప్పడే కాదు.. గతంలోనూ ఈ ఫొటోలు, ఫ్లెక్లీల వ్యవహారం దుమారం రేపింది. సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి బీజేపీ కార్యకర్తలు 'సాలు దొర' అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కౌంటర్‌గా 'సంపొద్దు మోదీ' అంటూ టీఆర్‌ఎస్‌ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. ఆ తర్వాత పరిస్థితులు.. ఉద్రిక్తతలకు దారి తీయడంతో తొలగించారు.

తదుపరి వ్యాసం