Girls Dance Video: డాన్స్ ఇరగదీసిన అక్కా చెల్లెలు.. వైరల్ మారిన వీడియో!-girls dance in wedding video viral in social media ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Girls Dance Video: డాన్స్ ఇరగదీసిన అక్కా చెల్లెలు.. వైరల్ మారిన వీడియో!

Girls Dance Video: డాన్స్ ఇరగదీసిన అక్కా చెల్లెలు.. వైరల్ మారిన వీడియో!

HT Telugu Desk HT Telugu
Sep 03, 2022 10:36 PM IST

Girls Dance Video: ఈ మధ్య నూతన వధూవరుల డ్యాన్స్ వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. పెళ్లి వేడుకల్లో సంగీత్, భరత్ సమయంలో చేసిన డ్యాన్స్ వీడియోలు ఎక్కువగా కనిపిస్తాయి. తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో వధువు తన సోదరితో కలిసి వేదికపై అద్భుతమైన డ్యాన్స్ చేస్తూ కనిపించారు.

Girls Dance Video
Girls Dance Video

డ్యాన్స్‌ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నిత్యం చాలా డ్యాన్స్‌ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంటాయి. చిన్నారులు, యువకుల డ్యాన్స్‌కు సంబంధించిన అనేక వీడియోలు ఇంటర్నెట్‌లో సందడి చేస్తాయి. ఈ మధ్య నూతన వధూవరుల డ్యాన్స్ వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. పెళ్లి వేడుకల్లో సంగీత్, భరత్ సమయంలో చేసిన డ్యాన్స్ వీడియోలు ఎక్కువగా కనిపిస్తాయి. తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో వధువు తన సోదరితో కలిసి వేదికపై అద్భుతమైన డ్యాన్స్ చేస్తూ కనిపించింది. డాన్స్ చాలా అద్భుతంగా ఉంది. అతిథులందరూ ఆమె డాన్స్ చూస్తూ అలానే ఉండిపోయారు.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో, వధువు ఆమె సోదరి తమ నృత్యం చేయడానికి వేదికపైకి ఎలా వచ్చారో మీరు చూడవచ్చు. ఆ తర్వాత కళ్లు తిప్పుకోలేని విధంగా బెస్ట్ ఎక్స్‌ప్రెషన్‌తో వారు డ్యాన్స్ తీరు అందర్నీ ఆకట్టుకుంది. ఇద్దరూ 'పాపా కెహ్తే హై' , 'దిల్బరో' పాటలపై డ్యాన్స్ చేస్తూ కనిపించారు. వధువు, ఆమె సోదరి అద్భుతమైన నృత్యంతో అలరించిన తీరు హాలులో ఉన్న బంధువులంతా ఒక్క క్షణం ఉద్వేగానికి లోనయ్యారు. అందమైన లెహంగాలు ధరించిన ఇద్దరు లేడీస్ తండ్రి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఈ డాన్స్ చేశారు. దీనిని చూసిన వధువు తండ్రి కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. తండ్రి-కూతుళ్ల బంధం ఎంతో గొప్పదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డాన్స్ తర్వాత తన కుమార్తెను గట్టిగా హాగ్ చేసుకుని భావోద్వేగానికి గురయ్యాడు.

సోషల్ మీడియాలో షేర్ చేసినప్పటి నుండి, వీడియో 43,858 కంటే ఎక్కువ లైక్‌లను పొందింది. కామెంట్ సెక్షన్‌లో హార్ట్, ఫైర్ ఎమోజీలతో వీక్షకులు ఈ వీడియోను వైరల్‌ చేస్తున్నారు. వారు డాన్స్ చూసిన నెటిజన్స్ ఫిదా అయిపోయారు. ఈ వీడియోను navikproductionsandanavis1201 అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేయబడింది. ఇప్పటి వరకు వేలల్లో వ్యూస్ కూడా వచ్చాయి.

WhatsApp channel

సంబంధిత కథనం