Covid cases in India: కొవిడ్ వ్యాప్తికి బ్రేక్..! యాక్టివ్ కేసుల్లోనూ తగ్గుదల-active covid cases in india decline to 55114 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Covid Cases In India: కొవిడ్ వ్యాప్తికి బ్రేక్..! యాక్టివ్ కేసుల్లోనూ తగ్గుదల

Covid cases in India: కొవిడ్ వ్యాప్తికి బ్రేక్..! యాక్టివ్ కేసుల్లోనూ తగ్గుదల

HT Telugu Desk HT Telugu
Sep 04, 2022 01:19 PM IST

Corona Cases in India : దేశంలో కొత్తగా 6,809 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ సోకి 26 మంది మృతి చెందారు.

భారత్ లో కరోనా కేసులు,
భారత్ లో కరోనా కేసులు, (LT)

Today Corona Cases India:Corona Cases in India : దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పడుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య దిగివస్తోంది. శనివారం నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు 6,809 మంది వైరస్ బారిన పడ్డార. కొవిడ్ సోకి మరో 26 మంది ప్రాణాలు కోల్పోయారు.

రికవరీ రేటు 98.69 శాతానికి పెరిగింది. యాక్టివ్​ కేసులు 0.12 శాతానికి తగ్గింది. కొత్తగా 8,414 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఒక్కరోజే 3,20,820 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

కొత్త కేసులు - 6809

కొత్త మరణాలు - 26

మొత్తం కేసులు: 4,44,56,535

మొత్తం మరణాలు: 5,27,965

రికవరీ రేటు - 98.69 శాతం

యాక్టివ్ కేసుల శాతం - 0.12 శాతం

యాక్టివ్ కేసులు: 55,114,

డైలీ పాజిటివిటీ రేటు - 2.12 శాతం

దేశంలో శనివారం 19,35,814 మందికి టీకాలు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 213.20 కోట్లకు చేరింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగాయి. కొత్తగా 441,476 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులోనే 1177 మరణాలు నమోదయ్యాయి. ఇక కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఈ ఏడాది జూలైలో భారత్ 200 కోట్ల మైలురాయిని చేరిన సంగతి తెలిసిందే. ప్రపంచంలో అతి తక్కువ కాలంలో 200 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేసిన రెండో దేశంగా భారత్ నిలిచింది. మరోవైపు కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరిగినప్పటికీ… మళ్లీ అదుపులోకి వస్తున్నాయి.

IPL_Entry_Point

టాపిక్