Nani Dasara Movie Release Date: సిల్క్ స్మిత ఫొటోతో ద‌స‌రా రిలీజ్ డేట్ చెప్పిన నాని-nani dasara movie gets release date ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nani Dasara Movie Release Date: సిల్క్ స్మిత ఫొటోతో ద‌స‌రా రిలీజ్ డేట్ చెప్పిన నాని

Nani Dasara Movie Release Date: సిల్క్ స్మిత ఫొటోతో ద‌స‌రా రిలీజ్ డేట్ చెప్పిన నాని

HT Telugu Desk HT Telugu
Aug 26, 2022 11:54 AM IST

Nani: నాని హీరోగా న‌టిస్తున్న ద‌స‌రా (Dasara Movie) సినిమా రిలీజ్ డేట్‌ను శుక్రవారం మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమా ఎప్పుడు ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌దంటే...

నాని
నాని (Twitter)

Nani Dasara Movie Release Date: నాని ద‌స‌రా సినిమా రిలీజ్ డేట్‌పై శుక్ర‌వారం క్లారిటీ ఇచ్చింది చిత్ర యూనిట్‌. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో రియ‌లిస్టిక్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. త‌న కెరీర్‌లో తొలి పాన్ ఇండియ‌న్ ప్రాజెక్ట్ ఇదే కావ‌డంతో ఈ సినిమా క‌థ‌, , త‌న క్యారెక్ట‌రైజేష‌న్ విష‌యంలో హీరో నాని ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

గోదావ‌రిఖ‌ని సమీపంలోని సింగ‌రేణి ప్రాంతానికి చెందిన ఫిక్ష‌న‌ల్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే క‌థ ఇది. సింగ‌రేణి యువ‌కుల మ‌న‌స్త‌త్వాల‌ను ర‌స్టిక్‌గా ఇందులో చూపించబోతున్నారు. కాగా ఈ సినిమాను 2023 మార్చి 30న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు శుక్ర‌వారం చిత్ర యూనిట్ తెలిపింది. కొత్త పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో నాని వెనుక సిల్క్ స్మిత ఫొటో క‌నిపించ‌డం ఆస‌క్తిని పంచుతోంది. ఈ క్యారెక్ట‌ర్ కోసం పూర్తిగా మేకోవ‌ర్ అయ్యి నాని న‌టిస్తున్నాడు.

పొడ‌వైన గ‌డ్డంతో పాటు తెలంగాణ యాస‌ను నేర్చుకున్నాడు. ద‌స‌రా సినిమాలో నానికి జోడీగా కీర్తిసురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఎమ్‌సీఏ త‌ర్వాత నాని, కీర్తిసురేష్ న‌టిస్తున్న సినిమా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. స‌ముద్ర‌ఖ‌ని, సాయికుమార్ కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు.తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌తో పాటు హిందీలో ఒకేసారి ఈ సినిమా రిలీజ్ కానుంది.

IPL_Entry_Point

టాపిక్