PM Kisan Status Check : పీఎం కిసాన్ నిధులు విడుదల.. క్రెడిట్ అయ్యాయో.. లేదో.. ఈ లింక్ ద్వారా తెలుసుకోండి
05 October 2024, 17:17 IST
- PM Kisan Status Check : పీఎం కిసాన్ 18వ విడత నిధులు విడుదలయ్యాయి. మాహారాష్ట్ర పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. పీఎం కిసాన్ నిధులను విడుదల చేశారు. రైతులకు నగదు క్రెడిట్ అయ్యిందో లేదో pmkisan.gov.in లింక్‌పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.
పీఎం కిసాన్ నిధులు విడుదల
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం పీఎం కిసాన్ పథకం కింద 18వ విడత నిధులు విడుదల చేశారు. రూ. 20,000 కోట్లను విడుదల చేశారు. దీని ద్వారా దేశవ్యాప్తంగా 9.4 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరింది. మహారాష్ట్రలోని వాషిమ్‌లో పర్యటించిన సందర్భంగా.. ప్రధాని మోదీ పీఎం కిసాన్ నిధులను విడుదల చేశారు.
18వ విడత నిధుల విడుదలతో పీఎం కిసాన్ కింద రైతులకు విడుదల చేసిన మొత్తం నిధులు రూ.3.45 లక్షల కోట్లకు చేరుకున్నాయి. 2019లో పీఎం కిసాన్ పథకాన్ని ప్రవేశపెట్టారు. భూమి కలిగి ఉన్న రైతులకు మూడు సమాన వాయిదాల్లో సంవత్సరానికి రూ. 6 వేలు కేంద్రం సాయం అందిస్తుంది. రైతులకు ఈ నిధులు పెట్టుబడి కోసం ఉపయోగపడతాయని ప్రధాని మోదీ చెప్పారు.
స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులు చాలా సులభంగా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
పీఎం కిసాన్ యోజన అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in ను ఓపెన్ చేయాలి.
ఫార్మర్స్ కార్నర్ విభాగానికి వెళ్లి క్లిక్ చేయాలి.
బెనిఫిషియరీ స్టేటస్ లింక్‌పై క్లిక్ చేయాలి.
మీ ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా నంబర్ లేదా మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి
చెల్లింపు స్టేటస్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
ఎవరికి ప్రయోజనం..
పీఎం కిసాన్ పథకం భారతదేశంలోని చిన్న, సన్నకారు రైతులకు మద్దతుగా ఉంటుంది.
2 హెక్టార్ల వరకు భూమి ఉన్న రైతులు ఈ పథకం పొందడానికి అర్హులు.
సకాలంలో సాయం అందించడానికి నిధులను నేరుగా వారి బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేస్తారు.
లబ్ధిదారుల జాబితాను ఇలా చూడొచ్చు..
రైతులు తాము లబ్ధిదారుల జాబితాలో ఉన్నారో లేదో ఈజీగా తెలుసుకోవచ్చు.
పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
లబ్ధిదారుల జాబితా పేజీకి నావిగేట్ అవ్వాలి.
మీ రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామం వివరాలను నమోదు చేయాలి.
'గెట్ రిపోర్ట్'పై క్లిక్ చేస్తే.. అప్పుడు లబ్ధిదారుల జాబితా ఓపెన్ అవుతుంది. దాంట్లో మీ పేరు ఉందో.. లేదో చూసుకోవచ్చు.