UPSC Aadhaar authentication : యూపీఎస్సీ అభ్యర్థుల ఆధార్​ వెరిఫికేషన్​- కొత్త వ్యవస్థ ఏలా పనిచేస్తుంది?-explained what upsc aspirants should know about aadhaar based authentication ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Upsc Aadhaar Authentication : యూపీఎస్సీ అభ్యర్థుల ఆధార్​ వెరిఫికేషన్​- కొత్త వ్యవస్థ ఏలా పనిచేస్తుంది?

UPSC Aadhaar authentication : యూపీఎస్సీ అభ్యర్థుల ఆధార్​ వెరిఫికేషన్​- కొత్త వ్యవస్థ ఏలా పనిచేస్తుంది?

Sharath Chitturi HT Telugu
Aug 30, 2024 11:15 AM IST

USPC aadhaar based authentication : యూపీఎస్సీ అభ్యర్థుల ఆధార్​ ఆధారిత ఆథెంటికేషన్​ ద్వారా వెరిఫికేషన్​ ప్రక్రియకు కేంద్రం ఆమోదించింది. ఇది ఎలా పనిచేస్తుంది? ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో ఎలాంటి మార్పులు వస్తాయి? ఇక్కడ తెలుసుకోండి..

యూపీఎస్సీ అభ్యర్థుల ఆధార్​ వెరిఫికేషన్​- కొత్త వ్యవస్థ ఏలా పనిచేస్తుంది?
యూపీఎస్సీ అభ్యర్థుల ఆధార్​ వెరిఫికేషన్​- కొత్త వ్యవస్థ ఏలా పనిచేస్తుంది?

ఓవైపు పూజా ఖేడ్కర్​ వివాదం కొనసాగుతున్న తరుణంలో, మరోవైపు యూపీఎస్సీ (యూనియన్​ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​) అభ్యర్థుల ఆధార్​ ఆధారిత ఆథెంటికేషన్​ ద్వారా వెరిఫికేషన్​ ప్రక్రియకు కేంద్రం ఆమోదించింది.

"వాలంటరీ బేసిస్​తో యూపీఎస్సీ అభ్యర్థుల ఐడెంటిటీని వెరిఫై చేసేందుకు ఆధార్​ ఆథెంటికేషన్​కి యూపీఎస్సీకి అనుమతిస్తున్నాము. వన్​ టైమ్​ రిజస్ట్రేషన్​తో పాటు పరీక్ష- రిక్రూట్​మెంట్​ సమయంలో ఈ ప్రక్రియ ఉంటుంది," అని సిబ్బంది వ్యవహారాల శాఖ పేర్కొంది.

ఈ నేపథ్యంలో అసలు ఈ ఆధార్​ ఆధారిత వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి? వంటి సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ముందు, అసలు ఆధార్​ ఆధారిత ఆథరైజేషన్​ అంటే ఏంటో తెలుసుకుందాము..

జూలై 2024లో, యూపీఎస్సీ ఒక టెండర్ నోటీసును జారీ చేసింది. పరీక్ష నిర్వహణ సమయంలో ఆధార్ ఆధారిత వేలిముద్ర ధృవీకరణ లేదా డిజిటల్ ఫింగర్ ప్రింట్ క్యాప్చర్, అభ్యర్థుల ముఖ గుర్తింపు, ఈ-అడ్మిట్ కార్డుల క్యూఆర్ కోడ్​ని స్కాన్ చేయడం, ప్రత్యక్ష ఏఐ ఆధారిత సిసిటివి వీడియో నిఘా ద్వారా పర్యవేక్షణను పొందుపరచాలనే కోరికను వ్యక్తం చేసింది.

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) ఆధార్ అథెంటికేషన్​ని "ఆధార్ నంబర్ హోల్డర్ డెమోగ్రాఫిక్ సమాచారం లేదా బయోమెట్రిక్ సమాచారంతో పాటు ఆధార్ నంబర్​ని దాని ధృవీకరణ కోసం సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రిపోజిటరీ (సిఐడిఆర్) కు సమర్పించే ప్రక్రియ" అని చెబుతున్నారు.

సింపుల్​గా చెప్పాలంటే, ఆధార్ అథెంటికేషన్ అనేది బయోమెట్రిక్, డెమోగ్రాఫిక్ డేటా ఆధారంగా అర్హులైన పౌరులందరికీ యూఐడీఏఐ జారీ చేసిన 12 అంకెల ఆధార్ నంబర్ ద్వారా ఒక వ్యక్తి వివరాలను ధృవీకరించే ప్రక్రియ.

యూఐడీఏఐ ప్రకారం.. ఆధార్ నంబర్ హోల్డర్ల గుర్తింపును ఎప్పుడైనా, ఎక్కడైనా తక్షణమే ధృవీకరించేందుకు వీలుగా డిజిటల్, ఆన్​లైన్ ఐడెంటిటీ ప్లాట్​ఫామ్​ను అందించడమే ఆధార్ ఆథెంటికేషన్ లక్ష్యం.

ఆధార్ ఆధారిత ధృవీకరణకు నాలుగు రకాలు ఉన్నాయి. అవి:

  • డెమోగ్రాఫిక్ అథెంటికేషన్
  • వన్ టైమ్ పిన్ (ఓటీపీ) ఆధారిత ఆథెంటికేషన్
  • బయోమెట్రిక్ ఆధారిత అథెంటికేషన్
  • మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్

యూపీఎస్సీ పరీక్షలో ఆధార్​ ఆథరైజేషన్​ ఎలా అంటే.. (నిపుణుల అంచనా)

యూపీఎస్సీ పరీక్షలకు రిజిస్టర్ చేసేటప్పుడు, నియామక ప్రక్రియ అంతటా అభ్యర్థి వివరాలను ధృవీకరించడానికి సంబంధిత సమాచారాన్ని పొందడంలో కమిషన్​కి సహాయపడటానికి దరఖాస్తుదారులు వారి ఆధార్ కార్డు అవసరమైన వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.

పరీక్షల సమయంలో ఆధార్ ఆధారిత ధృవీకరణ ప్రక్రియను చేర్చడానికి సర్వీస్ ప్రొవైడర్లు ఏం చేయాలో కమిషన్ జులై 16, 2024 నాటి టెండర్ నోటీసులో వివరించింది.

ఈ సూచనల్లో కొన్ని ఈ క్రింది విధంగా ఉన్నాయి:

అభ్యర్థుల ఆధార్ ఆధారిత ఫింగర్ ప్రింట్ ఆథెంటికేషన్ (లేకపోతే డిజిటల్ ఫింగర్ ప్రింట్ క్యాప్చర్), పరీక్ష సమయంలో ముఖ గుర్తింపు కోసం యూపీఎస్సీ అందించిన డేటాను ఉపయోగించండి.

ఆధార్ ఆధారిత ఫింగర్ ప్రింట్ ఆథెంటికేషన్, అభ్యర్థుల కార్యకలాపాల ముఖ గుర్తింపు నిర్దేశిత షెడ్యూలుకు అనుగుణంగా పూర్తయ్యేలా చూసేందుకు ప్రతి పరీక్షా కేంద్రం వద్ద తగినంత మంది సిబ్బందితో పాటు తగిన సంఖ్యలో క్యూఆర్ కోడ్ స్కానర్ ఇంటిగ్రేటెడ్ హ్యాండ్ హోల్డ్ పరికరాలను ఏర్పాటు చేయాలి.

ప్రతి పరీక్షా కేంద్రంలో సేకరించిన డేటా మొత్తం మెయిన్ సర్వర్​లో సింక్రొనైజ్ అయ్యేలా చూడాలి. పరీక్ష ప్రతి షిఫ్ట్ ముగియడానికి 30 నిమిషాల ముందు యూపీఎస్సీకి తెలియజేయాలి.

అడ్మిట్ కార్డులోని క్యూఆర్ కోడ్​ని స్కాన్ చేసి యూపీఎస్సీ అందించిన అప్లికేషన్ డేటాబేస్ నుంచి అభ్యర్థి వివరాలను ఆటోమెటిక్​గా పొందిన తర్వాత ఆధార్ ఆధారిత ఫింగర్ ప్రింట్ ఆథెంటికేషన్, లేకపోతే అభ్యర్థి వేలిముద్ర డేటాను డిజిటల్ ఫింగర్ ప్రింట్ క్యాప్చర్ చేయడం, ఆ తర్వాత చేతి పరికరం ద్వారా అభ్యర్థి ముఖ గుర్తింపు ఉంటుంది. నిర్ణీత ఫార్మాట్ ఆధారంగా అభ్యర్థులు సమర్పించిన ఫొటోల ప్రకారం ఫేషియల్ రికగ్నైజేషన్ చేయాల్సి ఉంటుంది.

యూపీఎస్సీ ఆదేశాల మేరకు పరీక్ష ప్రతి షిఫ్ట్ ప్రారంభానికి ముందే అన్ని అథెంటికేషన్, వెరిఫికేషన్ కార్యకలాపాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కమిషన్ ఆదేశించింది.

అభ్యర్థుల బయోమెట్రిక్ ఆథెంటికేషన్ / డిజిటల్ ఫింగర్ ప్రింట్ క్యాప్చరింగ్- ఫేషియల్ రికగ్నిషన్ చేయడానికి / లేదా ఇ-అడ్మిట్ కార్డులపై క్యూఆర్ కోడ్​ని స్కాన్ చేయడానికి అటువంటి సర్వీస్ ప్రొవైడర్లు పరీక్ష హాల్ / గదిలోకి ప్రవేశించడానికి అనుమతించమని యూపీఎస్సీ పేర్కొంది.

ఆధార్ ఆధారిత ధృవీకరణ: ఖేడ్కర్ వివాదం వల్లేనా?

పూజా ఖేడ్కర్ వివాదం- ఫోర్జరీ ఆరోపణల నేపథ్యంలో ఆధార్ ఆధారిత ధృవీకరణను ప్రవేశపెట్టడానికి యూపీఎస్సీకి అనుమతిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. సివిల్ సర్వీసెస్ పరీక్షలో అర్హతకు మించి మోసపూరితంగా ప్రయత్నించడమే కాకుండా, వైకల్యం, ఇతర వెనుకబడిన తరగతులు లేదా ఓబీసీ (నాన్ క్రీమీలేయర్) కోటాలను దుర్వినియోగం చేశారని మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారిపై ఆరోపణలు ఉన్నాయి.

అంతేకాకుండా పుణెలో శిక్షణ పొందుతున్న సమయంలో ఆమె అధికారాలను దుర్వినియోగం చేశారని ఆరోపించారు.

ఖేడ్కర్​కి గతంలో తాత్కాలికంగా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (2023 బ్యాచ్, మహారాష్ట్ర క్యాడర్) కేటాయించారు.

సెప్టెంబర్​లో యూపీఎస్సీ పరీక్షలు..

మరోవైపు సెప్టెంబర్ లో కీలకమైన పరీక్షలను నిర్వహించేందుకు యూపీఎస్సీ సన్నద్ధమవుతోంది. అవి..

  • ఎన్డీఏ పరీక్ష 2024 - సెప్టెంబర్ 1, 2024
  • సీడీఎస్ పరీక్ష 2024: సెప్టెంబర్ 1, 2024
  • సివిల్ సర్వీసెస్ (మెయిన్స్) పరీక్ష, 2024: సెప్టెంబర్ 20, 2024 (5 రోజులు)

సంబంధిత కథనం